థియేటర్లలో దుమ్మురేపుతున్న కాంతార చాప్టర్ 1 ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?

Published : Oct 03, 2025, 12:09 PM IST

రిషబ్ శెట్టి నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా 'కాంతార చాప్టర్ 1' రిలీజ్ అయింది. థియేటర్స్ లో దుమ్మురేపుతోన్న ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. ఇంతకీ ఈసినిమా ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతోంది, ఎక్కడ చూడవచ్చు?

PREV
15
కాంతార చాప్టర్ 1 హవా

దేశ వ్యాప్తంగా సినిమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1). ఈనెల 2న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా దుమ్మురేపుతోంది. అన్ని థియేటర్లలో కాంతార చాప్టర్ 1 హవా మొదలైంది. మొదటి రోజే బాలీవుడ్ సినిమాలను దాటి, తుఫానులా దూసుకుపోతున్న కాంతార చాప్టర్ 1 చూడటానికి జనాలు ఉత్సాహంగా ఉన్నారు. బెంగళూరులో ఒకే రోజు 1,000కి పైగా షోలతో కాంతార చాప్టర్ 1 రిలీజ్ అయింది. ఇటీవలి కాలంలో ఈ ఘనత సాధించిన రెండో కన్నడ సినిమాగా ఇది నిలిచింది.

25
థియేటర్లలో దుమ్మురేపుతోన్న కాంతార చాప్టర్ 1

కాంతార రిలీజ్ అయ్యి మొదటి రోజు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఒక్క రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 70 కోట్లకు పైగా వసూలు చేసింది. టాలీవుడ్ లోనే ఈమూవీ ఒక్క రోజు 12 కోట్ల వరకూ కలెక్షన్లు రాబట్టింది. ప్రీమియర్ షోలకు కూడా భారీగా రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా లవర్స్ కాంతార చాప్టర్ 1కి ఫుల్ మార్క్స్ ఇచ్చారు. థియేటర్లలో దుమ్మురేపుతున్న కాంతార చాప్టర్ 1 ఓటీటీ డీల్ కూడా పూర్తయింది. సినిమా ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వస్తుంది, డీల్ ఎంతకు కుదిరింది.

35
కాంతార చాప్టర్ 1 కొన్నది ఎవరు?

కాంతార చాప్టర్ 1 సినిమా థియేటర్లను షేక్ చేస్తోంది. ఇక ఈమూవీ ఓటీటీ డీల్ కూడా పూర్తి అయ్యింది. అమెజాన్ ప్రైమ్ 'కాంతార చాప్టర్ 1' సినిమా రిలీజ్ హక్కులను తీసుకుంది. రిపోర్ట్స్ ప్రకారం, కాంతార చాప్టర్ 1 డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 125 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. పింక్‌విల్లా రిపోర్ట్ ప్రకారం, 125 కోట్ల రూపాయలకు అమ్ముడైన మొదటి కన్నడ సినిమా ఇదే. ఈ లిస్ట్‌లో కేజీఎఫ్ 2 రెండో స్థానంలో ఉంది. కాంతార చాప్టర్ 1 డిజిటల్ హక్కులను అమెజాన్ అన్ని భాషల్లోనూ దక్కించుకుంది.

45
ఓటీటీ లో కాంతార చాప్టర్ 1 ఎప్పుడు?

సమాచారం ప్రకారం, అక్టోబర్ 30 నుంచి ప్రజలు అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు. థియేటర్లలో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వెర్షన్లు అక్టోబర్ 30న రిలీజ్ కానుండగా, హిందీ వెర్షన్ ఎనిమిది వారాల తర్వాత రిలీజ్ అవుతుంది.

55
1500 ఏళ్ల నాటి కథతో

2022లో రిలీజైన 'కాంతార' సినిమా సైలెంట్ గా వచ్చి ప్రపంచవ్యాప్తంగా పెద్ద సక్సెస్ సాధించింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్ 1' వచ్చింది, సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాంతార చాప్టర్ 1 సినిమాలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన రిషబ్ శెట్టి భార్య ప్రగతి శెట్టి ఎమోషనల్ అయ్యారు. సినిమా క్లైమాక్స్ చూసి భావోద్వేగానికి గురైన ఆమెను రిషబ్ శెట్టి ఓదార్చారు. 1500 ఏళ్ల నాటి కథతో రిషబ్ శెట్టి వచ్చారు. ట్రైలర్ చూసి చాలా థ్రిల్ అయిన ఫ్యాన్స్ ఇప్పుడు కాంతార చాప్టర్ 1 సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories