10 కేజీలు తగ్గబోతున్న రామ్ చరణ్, గ్లోబల్ హీరో సాహసానికి కారణం ఏంటి?

మెగా పవర్ స్టార్.. గ్లోబల్ హీరో రామ్ చరణ్ చాలా పెద్ద సాహసం చేయబోతున్నాడు. పదికేజీల బరువు తగ్డబోతున్నాడట మెగా హీరో. ఇంత సాహసం ఎందుకు చేస్తున్నాడు. అసలు ఇందులో నిజం ఎంత..? 

Ram Charan to Lose 10 Kilos for His Next Film Why Is the Global Star Taking This Huge Challenge in telugu jms

రీసెంట్ గా  గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే ఈసినిమా ఈసినిమా ఫలితం ఆయన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. గేమ్ ఛేంజర్ కోసం దాదాపు మూడేళ్ళకు పైగా టైమ్ కేటాయించాడు రామ్ చరణ్. ఈసినిమా చేస్తూ మరే సినిమాను కమిట్ అవ్వలేదు. కాని ఫలితం ఇలా రావడంతో చాలా నిరాశ చెందాడు. ఇక ఈ మెగా హీరో నెక్ట్స్ బుచ్చిబాబు సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. 

Also Read: సుమన్ ను బ్లూ ఫిలిం కేసులో ఇరికించిన ముఖ్యమంత్రి ఎవరు? అందులో చిరంజీవి పాత్ర ఏమిటి?
 

Ram Charan to Lose 10 Kilos for His Next Film Why Is the Global Star Taking This Huge Challenge in telugu jms

అందుకోసం మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కథలో డెప్త్ ఉండేలా చూసుకుంటున్నారట. సన్నివేశాలు కూడా తేలిగ్గా తీసిపడేలా ఉండకుండా కాస్త వెయిట్ ఉన్న సీన్స్ ను డిజైన్ చేస్తున్నారట. అంతే కాదు ఈసినిమాలో కూడా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ ను కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట టీమ్. 

Also Read: 300 కోట్ల ఇల్లు, 3 కోట్ల కారు, భర్తకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవరు?


Ramcharan

ఈ సినిమా కథ సుకుమార్ రాయడంతో  ఆయన అండర్ లో బుచ్చిబాబు దర్శకుడిగా సినిమా తెరకెక్కబోతోంది కాబట్టి. ఈమూవీవిషయంలో భయపడాల్సిన అవసరం లేదు అంటున్నారు సినిమా జనాలు. ఇక అవన్నీ పక్కన పెడితే.. ఈసినిమా కోసం రామ్ చరణ్ పెద్ద సాహసం చేయబోతున్నాడట. ఏకంగా 10 కేజీల బరువు తగ్గబోతున్నాడట. ఈమూవీలో రెండు పాత్రల్లో కనిపించబోతున్న రామ్ చరణ్.. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోని పాత్రకోసం వెయిట్ తగ్గడానికి ఇప్పటికే డైటింగ్ కూడా స్టార్ట్ చేశాడట. 

Also Read: 100 మందితో పవన్ కళ్యాణ్ భారీ ఫైట్, రామ్ చరణ్ మగధీరను కాపీ కొట్టబోతున్నాడా?

Ram Charan

అయితే ఇప్పటికే ఈసినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ నడుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. ముందుగా రామ్ చరణ్ స్టార్టింగ్ వచ్చే పాత్రకు సబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఆతరువాత ప్లాష్ బ్యాక్ కోసం బరువుతగ్గబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత లాస్ అయిన వెయిట్ ను తిరిగి పొందేలా ప్లాన్ చేశారట. సినిమా కోసం 10 కేజీల బరువు తగ్గబోతున్నాడట రామ్ చరణ్. 

ఇది ఒక సాహసమే అని చెప్పాలి. మరి ఇంత కష్టపడుతున్న రామ్ చరణ్ సినిమా కోసం ఏం చేయడానికైనా వెనకాడటంలేదు. మరి ఈసారైనా అదృష్టం వరించి మంచి సినిమా అవుతుందో లేదో చూడాలి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఆతరువాత వచ్చిన గేమ్ ఛేంజర్ పరిస్థితి కూడా ఇలానే అయ్యింది. 

దాంతో ఈసారి చేయబోయే సినిమా విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారట. రాబోయే సినిమా ప్లాప్ అయితే.. హ్యాట్రిక్ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాడు చరణ్. కాని చూడాలి సుకుమార్ కథతో.. బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడతో ఈమూవీ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!