Vishwak Sen : 'లైలా' వాయిస్ షాకింగ్ సీక్రెట్ , ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

Published : Feb 12, 2025, 11:46 AM IST

విశ్వక్ సేన్ నటిస్తున్న లైలా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు, బ్రేక్ ఈవెన్ టార్గెట్, మరియు సినిమాలోని ఒక ఆసక్తికరమైన సీక్రెట్ గురించి తెలుసుకోండి.

PREV
13
Vishwak Sen : 'లైలా'  వాయిస్ షాకింగ్  సీక్రెట్ ,  ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్
Actor Vishwak Sen Laila pre release business details in telugu

విశ్వక్ సేన్ నటిస్తున్న  కొత్త చిత్రం   లైలా  నెగిటివ్ గానో,  పాజిటివ్ గానో జనాల్లోకి వెళ్లటం మాత్రం జరుగుతోంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.  గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో జస్ట్ ఓకే అనిపించుకున్న విశ్వక్..  లైలాగా ఖచ్చితంగా మనల్ని ఎంటర్ టైన్ చేస్తానంటున్నాడు.

అన్ని హంగులను పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యిన  ఈ సినిమాకు ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో చేస్తున్నారు.   ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాలు చూద్దాం.

23
Actor Vishwak Sen Laila pre release business details in telugu

  లైలా ప్రీ రిలీజ్ బిజినెస్ 


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా డీసెంట్  బిజినెస్ చేసింది.  తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ లో  బిజినెస్ అయ్యిందని వినికిడి.  రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లు కలిపి మరో 2.2 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని చెప్తున్నారు.

దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 8.2 కోట్ల రేంజ్ లో జరిగింది.   సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇప్పుడు ఓవరాల్ గా… 9 కోట్ల రేంజ్ లో షేర్ రావాలి. అదే బ్రేక్ ఈవెన్ టార్గెట్.  ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా అది నల్లేరు మీద నడకే.  

33
Actor Vishwak Sen Laila pre release business details in telugu

  లైలా వాయిస్ సీక్రెట్


అలాగే ఈ సినిమాకు సంభందించిన  సీక్రెట్ ఏమిటంటే.. విశ్వక్ సేన్ లేడీ గెటప్ కు వాయిస్ ఇచ్చింది ఓ స్టార్ సింగర్. విశ్వక్ అమ్మాయి వాయిస్ తో డబ్బింగ్ చెప్తే సెట్ అవ్వదని ఓ సింగర్ తో డబ్బింగ్ చెప్పించారట.

ఆ సింగర్ ఎవరంటే.. తెలుగులో ఎన్నో సాంగ్స్ పాడి అలరించిన శ్రావణ భార్గవి. లైలా సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ కు శ్రావణభార్గవి డబ్బింగ్ చెప్పిందట.   ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. రీసెంట్ గా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.

Read more Photos on
click me!

Recommended Stories