మెగా కోడలు.. రామ్ చరణ్ భార్య ఉపాసన కవల పిల్లలను కనబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె డెలివరీ డేట్ పై వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఉపాసన డెలివరీ డేట్ ఎప్పుడు?
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కామినేని జనవరి 31, 2026న కవలలకు జన్మనివ్వబోతున్నారని సమాచారం. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇప్పటికే జూన్ 20, 2023న క్లిన్ కారా కొణిదెల అనే కుమార్తె ఉంది. ఈ కవలల రాకతో మెగా కుటుంబంలో పండగ జరగబోతోంది. అక్టోబర్ 23, 2025న ప్రెగ్నెన్సీని కన్ ఫార్మ్ చేశారు ఉపాసన దంపతులు.. కానీ డెలివరీ తేదీపై అధికారికంగా ప్రకటించలేదు.
24
హిట్ కోసం మెగా పవర్ స్టార్ వెయిటింగ్
ఇక సినిమాల విషయానికొస్తే, ‘గేమ్ ఛేంజర్’తో డిజాస్టర్ ఫేస్ చేసిన రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' రిలీజ్ కోసం సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
34
పెద్ది రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు?
వాస్తవానికి మార్చి 2026లో విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని, నిర్మాతలు నిరవధికంగా వాయిదా వేశారు. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు మరికొంత కాలం ఆగాల్సిందే. కానీ స్టార్ కాస్ట్, ఏఆర్ రెహమాన్ సంగీతం వల్ల అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.
'పెద్ది' తర్వాత, రామ్ చరణ్ సుకుమార్‌తో కలిసి పనిచేయనున్నారు. ఇది అభిమానులకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. వీరి కాంబోలో గతంలో రంగస్థలం సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక చరణ్ , ఉపాసన కవలల రాక కోసం ఎదురుచూస్తున్నారు. వీరి మొదటి సంతానం అయిన క్లింకార ఫేస్ ను ఇప్పటి వరకూ రివిల్ చేయలేదు మెగా జంట. ఈ కవలలను అయినా అభిమానులకు పంచయం చేస్తారా లేదా చూడాలి.