
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో గ్లోబల్ ట్రోటర్ `వారణాసి` మూవీ రూపొందుతుంది. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే చిత్రీకరణ చేస్తున్నారు. త్వరలోనే అంటార్కిటికా ఖండంలో షూటింగ్ చేయబోతున్నారు. అక్కడ చిత్రీకరణ జరుపబోతున్న తొలి ఇండియన్ సినిమా `వారణాసి` కావడం విశేషం. భారీ స్థాయిలోనే అక్కడ షూటింగ్ చేయబోతున్నారట. ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో సడెన్‌గా మరో ట్రీట్ ఇచ్చారు రాజమౌళి.
`వారణాసి` సినిమా రిలీజ్ డేజ్‌ని ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో మూవీ రిలీజ్ కాబోతుందని ఆ మధ్య గ్లింప్స్ విడుదల సమయంలోనే వెల్లడించారు. ఇప్పుడు డేటని ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. ఐమాక్స్ ఫార్మాట్‌లో దీన్ని రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. దీంతో ఇప్పుడిది ట్రెండింగ్‌లోకి వచ్చింది. మహేష్ బాబు అభిమానులు హ్యాపీ అవుతున్నారు.
అయితే ఈ రిలీజ్ డేట్ కి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం వార్తల్లో నిలుస్తుంది. ఈ రిలీజ్ డేట్ కన్ఫమ్ చేయడానికి కారణం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సింది. రాజమౌళి వేసిన స్కెచ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏకంగా రెండు వారాలపాటు హాలీడేస్ రావడం విశేషం. సాధారణంగా సమ్మర్‌లో చాలా వరకు హాలీడేస్ ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోతాయి. దీంతో స్టూడెంట్స్ అంతా ఫ్రీ అవుతారు. అప్పుడు సినిమా వస్తే ఎగబడి చూస్తారు. రాజమౌళి ఈ డేట్‌ని ఫైనల్ చేయడం వెనుక ఇదొక కారణంగా చెప్పొచ్చు.
`వారణాసి` రిలీజ్ రోజు ఏప్రిల్ 7న ఉగాది పండగ. అందరికి సెలవు. అలాగే ఏప్రిల్ 8, 9 వీకెండ్, సాధారణంగా హాలీడేస్ ఉంటాయి. మధ్యలో రెండు రోజులు మాత్రమే వర్కింగ్ డేస్. ఆ తర్వాత ఏప్రిల్ 14న హాలీడే ఉంది. ఏప్రిల్ 15న శ్రీరామ నవమి ఉంది. హాలీడే వస్తుంది. మళ్లీ ఏప్రిల్ 16, 17, 18 వరకు వీకెండ్ వస్తుంది. వరుసగా హాలీడేస్‌లాగానే కన్సిడర్ అవుతాయి. ఆ తర్వాత స్కూల్స్ కి కూడా హాలీడేస్ వస్తాయి. దీంతో ఈ సమ్మర్ మొత్తం సినిమాకి కలిసి రాబోతుందని చెప్పొచ్చు.
రాజమౌళి `వారణాసి` మూవీని భారీగా ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రాజెక్ట్ తరహాలో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలతోనూ కలవబోతున్నట్టు సమాచారం. ఇదొక గ్లోబల్ ఫిల్మ్ గానే ప్రొజెక్ట్ చేయబోతున్నారట. ఇప్పటి వరకు మన ఇండియన్ మూవీస్ రెండు వేల కోట్ల వరకు కలెక్షన్లు సాధించాయి. అయితే ఇప్పుడు `వారణాసి` మినిమమ్‌గా మూడు వేలకోట్లు టార్గెట్ చేసినట్టు సమాచారం. మూడు నుంచి నాలుగు వేల కోట్ల వరకు టార్గెట్‌గా పెట్టుకున్నారని సమాచారం. ఈ మూవీకి బడ్జెట్ సుమారు రూ.1200కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
యాక్షన్ అడ్వెంచరస్‌గా సాగే మూవీలో రామాయణానికి సంబంధించిన అంశాలు కూడా ఉండబోతున్నాయట. లంకా దహనం సీన్లు హైలైట్‌గా ఉండబోతున్నాయట. ఇందులో మహేష్ బాబు రాముడిగా కనిపించబోతున్నాడట. టైమ్ ట్రావెల్ కథతో సినిమా సాగుతుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. అలాగే దాదాపు మూడు నాలుగు కాలల్లో హీరో ప్రయాణిస్తాడట. ఆఫ్రీకన్ అడవులు, అంటార్కిటికా, వారణాసి, రామాయణంలోని లంకా దహనం వంటివి మెయిన్‌గా చూపించబోతున్నారట. ఈ కాలాల్లోకి, ప్రాంతాల్లోకి మహేష్ బాబు చేసే జర్నీనే ఈ మూవీని అని తెలుస్తోంది. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ విజువల్ వండర్‌గా ఉంది. గూస్ బంమ్స్ తెప్పించింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.