Published : Feb 09, 2025, 03:32 PM ISTUpdated : Feb 09, 2025, 03:34 PM IST
సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక సేవలో తరిస్తారు అని అందరికి తెలిసిందే. అయితే ఎవరికి తెలియకుండా హిమాలయాలకువెళ్లి వచ్చే తలైవా.. దాదాపు 20 ఏళ్లుగా రహస్యసాధన ఒకటి చేస్తున్నారట. అందేంటో తెలుసా..?
Actor Rajinikanth starrer Baashha film updates out
సూపర్ స్టార్ రజినీకాంత్ 74 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ.. చెకచెక సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మధ్యలో కాస్త అనరోగ్యం వచ్చినా.. రెస్ట్ తీసుకుని వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. రాజకీయల్లోకి వెళ్ళాలని అనకున్నా.. అనారోగ్యం కారణంగా ఆయన వెనకడుగు వేశారు. దాంతో వెంటనే విజయ్ అవకాశాన్నిఅందిపుచ్చుకుని పాలిటిక్స్ లోకి దూకాడు.
సరే ఆ విషయం పక్కన పెడితే.. సూపర్ స్టార్ రజినీకాంత్ కు 74 ఏళ్లు.. అయినా సరే అంత హుషారుగా ఎనర్జిటిక్ గా యూత్ ఫుల్ గా ఎలా ఉండగలుగుతున్నారు. చాలా ఫిట్ గా ఉంటూ.. సినిమాలను చకచకా కంప్లీట్ చేసుకుంటూ.. హెవీ యాక్షన్స్ సీన్స్ ను కూడా అవలీలగా చేయగలుగుతున్నారు రజినీకాంత్. పైగా ఆయన గత పదేళ్లుగా సినిమాలు చేస్తున్నదర్శకులంతా యూత్ కావడం విశేషం. వారికి పోటీగా నటిస్తూ.. వారి ఎనర్జీని అందుకోగలుగుతున్నారు.
ఇప్పటికీ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్‌గా కొనసాగుతున్నారు. అయితే రజనీ ఇలా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటి? ఆరోగ్యంగా, ప్రశాంతంగా, అనవసర ఆందోళనల లేకుండా జీవితాన్ని ఆస్వాదించేందుకు రజినీకాంత్ ఎలాంటి ఫార్ములా వాడుతున్నారు.
రజినీకాంత్ సినిమాలు, షూటింగ్ లు, ఆస్తి విషయాలు, ఇలా రకరకాల పనులతో ఎప్పుడు బిజీగా ఉండాల్సి వస్తుంది.కాని అన్ని చూసుకుంటూ.. అంత ఆస్తిని మెయింటేన్ చేస్తూ కూడా సూపర్ స్టార్ అంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు.
ఆయన ఆరోగ్య రహస్యం గురించి రీసెంట్ గా వెల్లడించారట. సూపర్ స్టార్. దాదాపు 20 ఏళ్ళకు పైగా ఆయన ఒక యోగాన్ని సాధన చేస్తున్నారట. దాని పేరే క్రియా యోగా అని రజనీకాంత్ వెల్లడించారు. అయితే అది చేయడానికి , నేర్చుకుని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి తనకు 12 ఏళ్ళకు పైనే పట్టిందన్నారు సూపర్ స్టార్. స్టార్టింగ్ తో దీని కోసం చాలా ఇబ్బందులు పడ్డారట రజినీ.
ఎంత ప్రయత్నించినా ఫిలితం కనిపించలేదట. ఆతరువాత నిదానంగా సాధన పెంచి.. పూర్తిగా లీనమవ్వడంతో.. క్రియా యోగా చేయగలుతున్నాను అన్నారు. ప్రతీరోజు సాధన చేయడం ద్వారా అది పూర్తిగా అలవాటు అయ్యిందట రజినీకాంత్ కు. ఇప్పుడు ఇది సూపర్ స్టార్ జీవితంలో భాగం అయ్యిందట.
2002లో క్రియా యోగాను ప్రారంభించినప్పటికీ, దాని అసలు ప్రయోజనాన్ని పూర్తిగా అనుభవించేందుకు పదేళ్లు పట్టిందని రజినీకాంత్ అన్నారు. ప్రస్తుతం రజనీ కూలీ , జైలర్ 2 వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినా సరే ఈ యోగాన్ని రోజూ ఈ సాధన చేయడం వల్ల తన ఎనర్జీ మారకుండా ఉంటుందని చెబుతున్నారు. 21 ఏళ్లుగా నిరంతరంగా క్రియా యోగాను కొనసాగిస్తున్న రజనీకాంత్, తన ఆరోగ్యానికి, ఉత్సాహానికి కారణం ఇదే అంటున్నారు.