బాలయ్య, చిరంజీవి, ప్రభాస్, మహేష్ అంతా హైదరాబాద్ లోనే షూటింగ్.. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే..

Published : Feb 09, 2025, 01:16 PM IST

సంక్రాంతి హంగామా ముగిసింది. ఇక టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ మొదలు కాబోతోంది. సమ్మర్ కి రావలసిన చిత్రాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. మరికొందరు హీరోల చిత్రాల షూటింగ్ జరుగుతోంది.

PREV
15
బాలయ్య, చిరంజీవి, ప్రభాస్, మహేష్ అంతా హైదరాబాద్ లోనే షూటింగ్.. ఎవరెవరు ఎక్కడెక్కడ అంటే..
Mahesh Babu, Balakrishna, Prabhas

సంక్రాంతి హంగామా ముగిసింది. ఇక టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ మొదలు కాబోతోంది. సమ్మర్ కి రావలసిన చిత్రాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. మరికొందరు హీరోల చిత్రాల షూటింగ్ జరుగుతోంది. దాదాపు అందరు స్టార్ హీరోల చిత్రాలు ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఏ సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోందో ఆ అప్డేట్స్ తెలుసుకుందాం. 

25
Rajamouli, mahesh babu, Priyanka chopra, SSMB29

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అజీర్ నగర్ ప్రాంతంలో జరుగుతోంది. ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం ఫౌజి షూటింగ్ కూడా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో జరుగుతోంది ప్రత్యేకమైన సెట్ నిర్మించి అక్కడ షూటింగ్ చేస్తున్నారు. అంటే ప్రభాస్ ఒకేసారి రెండు చిత్రాల షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. 

35

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో ఇది నాల్గవ చిత్రం. అఖండ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్ర షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. 

45

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శంషాబాద్ దగ్గర్లోని ముచ్చింతల్ ప్రాంతంలో జరుగుతోంది. అయితే పవన్ అనారోగ్యానికి గురి కావడంతో ప్రస్తుతం షూటింగ్ లో ఆయన పాల్గొంటున్నారో లేదో తెలియదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ఎస్ఎస్ ఎంబి 29 షూటింగ్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. 

55

మెగా పవర్ స్టార్ రాంచరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆర్సీ 16 చిత్ర తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోని బూత్ బంగ్లాలో ముగిసింది. చివరిరోజు షూటింగ్ కి రాంచరణ్ తన కుమార్తె క్లింకార కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వీటితో పాటు నాని హిట్ 3, సాయిధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు, నిఖిల్ స్వయంభు, చిరంజీవి విశ్వంభర చిత్రాల షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories