తాను సినిమా ఫీల్డ్ కి సంబంధం లేని వాడిని అని, సినిమా యాక్టర్ అవ్వాలని కూడా తాను అనుకోలేదని, యాక్టింగ్ కోర్స్ చేయడం గానీ, డాన్సులు, ఫైట్లు నేర్చుకోవడం గానీ చేయలేదు. అన్నీ అలా వచ్చాయి. బలవంతంగా సినిమా రంగంలోకి లాక్కొచ్చారని తెలిపారు. తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ తప్ప ఏం తెలియదని, కానీ చేసుకుంటూ వచ్చానని, ఆ తర్వాత అదే వృత్తిగా మారిందని, విజయాలు వచ్చాయి. ఆదరించారు. ఈ స్థాయికి వచ్చానని చెప్పారు సుమన్. అయితే కొన్ని సార్లు ఎప్పుడూ ఇదేనా, రొటీన్ వర్క్ చేయాలా? ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదాం అనుకున్నాడట. కానీ అనుకునేలోపే ఓ పది సినిమాలు వచ్చేవి, వాళ్లు, వీళ్లు బలవంతం చేయడంతో ఒప్పుకునేవాడిని, అవి చేయడానికి కొన్నేళ్లు పట్టేది, మళ్లీ అనుకోవడం, మళ్లీ ఆఫర్స్ రావడం ఇలా 45ఏళ్లు గడిచిపోయాయని తెలిపారు సుమన్.