1000 కోట్ల కలెక్షన్స్ కోసం రిషబ్ శెట్టి మాస్టర్ ప్లాన్, కాంతార చాప్టర్ 1 నెక్ట్స్ రిలీజ్ ఎక్కడో తెలుసా?

Published : Oct 23, 2025, 08:40 AM IST

కాంతార చాప్టర్ 1 మూవీ 1000 కోట్ల కల నెరవేరేలా కనిపించడంలేదు. ఎలాగైనా ఈసినిమా వసూళ్లను వెయ్యి కోట్లు దాటించాలన్న ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ సిద్దం చేశాడు రిషబ్ శెట్టి.. ఇంతకీ అతను ఏం చేయబోతున్నాడు.

PREV
15
ఏదో అనుకుంటే మరేదో అయ్యింది

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, హీరోగా నటించిన సినిమా కాంతార చాప్టర్ 1. ఈసినిమా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ఈసినిమా కోసం ఎంతో ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే భారీ ఓపెనింగ్స్ ను కూడా సాధించింది కాంతార చాప్టర్ 1. కానీ అనుకున్నటార్గెట్ మాత్రం చేరుకోలేకపోతోంది. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయిన ఈసినిమా.. ఆతరువాత కాస్త స్లో అయ్యింది. ఈ ఊపుతో 1000 కోట్ల కలెక్షన్ మార్క్ ను ఈజీగా సాధిస్తుంది అనుకున్న టీమ్ కు షాక్ తగిలింది. కాంతార సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు అవుతున్నా.. 800 కోట్ల దగ్గరే కలెక్షన్స్ ఆగిపోయాయి. దాంతో మాస్టార్ ప్లాన్ సిద్దం చేస్తున్నాడు రిషబ్ శెట్టి.

25
20 రోజుల్లో 800 కోట్లు

కాంతార చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2న దసరా సందర్భంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా 20 రోజులకు గాను దాదాపుగా 800 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ మూవీని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వెర్షన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ అవుతుందని, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ప్రకటించింది. ఈ వెర్షన్ రిలీజ్ అయితే కలెక్షన్స్ లో కాస్త ఊపు వస్తుందని వారు భావిస్తున్నారు. ఇలాగైనా 1000 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చు అని ఎదరుచూస్తున్నారు.

35
కేజీయఫ్ రికార్డు బ్రేక్ చేస్తుందా?

సౌత్ లో అత్యధికంగా 1000 కోట్ల కలెక్షన్ సినిమాలు అందించింది తెలుగు పరిశ్రమే. తమిళం నుంచి ఒక్క సినిమా కూడా ఈ వెయ్యి కోట్ల కలను నెరవేర్చుకోలేకోలేకపోయింది. ఇక కన్నడ పరిశ్రమ నుంచి యష్ నటించిన కేజీయఫ్ చాప్టర్ 2 మాత్రం వెయ్యి కోట్ల వసూళ్లు దాటి రికార్డు సృష్టించింది. ఇక ఈసినిమా తరువాత కాంతార చాప్టర్1 ఈ ఘనతను సాధిస్తుందని అందరు ఎదురు చూశారు. కానీ 800 దగ్గరే కాంతార కలెక్షన్స్ స్లో అవ్వడంతో.. 1000 కోట్ల కల నెరవేరుతుందా లేదా అని ఎదరుచూస్తున్నారు. కాంతార1 ఈ మార్క్ ను దాటగలిగితే.. కన్నడ నుంచి రెండో సారి వెయ్యి కోట్ల కలెక్షన్ రికార్డు నమోదు అవుతుంది. యష్ తో పాటు రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా హీరోగా మారిపోతాడు.

45
ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యారు..

కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ప్రేక్షకులను కట్టిపడేశాడని చెప్పాలి.. మునుపెన్నడూ చూడని విధంగా థ్రిల్లింగ్ అనుభూతిని ఆడియన్స్ కు ఈ సినిమా ద్వారా అందించాడు. ఈ సినిమాలో సౌత్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ముఖ్యమైన పాత్రలో నటించింది. మలయాళ స్టార్ నటుడు జయరాం నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం హైలెట్ అని చెప్పవచ్చు. కాంతార కు అజనీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ .. థియేటర్లలో ఆడియన్స్ కు పూనకాలు తెప్పించింది. కాంతార మ్యూజిక్ వినగానే ప్రతీ ఒక్కరికి గూజ్ బామ్స్ వచ్చేలా ఆయన మ్యూజిక్ చేశారు. ఈ మ్యూజిక్ కి తోడుగా..అరవింద్ ఎస్ కశ్యప్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు.

55
రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయం

కాంతార మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, తుళు వెర్షన్లను నిర్మాతలు విడుదల చేశారు. అవన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. సూపర్ హిట్టయిన కాంతార మొదటి భాగం కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తీసి, 400 కోట్లు వసూలు చేసింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక కాంతారలో రిషబ్ శెట్టి పోషించిన శివ పాత్ర తండ్రి కథే కాంతార చాప్టర్ 1. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయం చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories