Karthika Deepam 2 Latest Episode: జ్యో చెంప పగలకొట్టిన పారు-నీ నాటకాలు ఆపు కార్తిక్ అన్న శివన్నారాయణ

Published : Oct 23, 2025, 07:59 AM IST

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (అక్టోబర్ 23వ తేదీ)లో మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మనకు మైనస్ కాదు అంటుంది జ్యో. జ్యో చెంప చెల్లుమనిపిస్తుంది పారు. సడెన్ గా కార్తిక్ ఇంటికి వచ్చి.. నీ నాటకాలు ఆపమంటాడు శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందింటే..

PREV
15
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో జ్యోత్స్న ఇంటికి వచ్చిందా.. అంటాడు కార్తీక్. అవును అనుమానంతో వచ్చింది. అంతా వెతికి చూసుకుంది అని చెబుతుంది దీప. అయితే అత్త ఇక్కడ ఉన్న నిజాన్ని ఎక్కువ కాలం దాచలేము. మామయ్యకు ఫోన్ చేసి చెప్తాను అంటాడు కార్తీక్. వద్దు బావ అంటుంది దీప. అత్త ఏదో కోపంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఆ ఇంటికి వెళ్లను.. అని ఆవేశంలో వంద మాటలు అంటుంది అంటాడు కార్తీక్. 

ఆవేశంలోనే కాదురా. స్పృహలోకి వచ్చాక కూడా వదిన అలాగే ఉందని చెబుతుంది కాంచన. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతాను అంటుంది. వదినా ఇంతకుముందులా లేదు అని చెప్తుంది కాంచన. సుమిత్రమ్మ గారు మీకు తెలిసిన మనిషిలా లేరు. మీరు ఒకసారి ఆవిడతో మాట్లాడండి అంటుంది దీప. అంతకంటే ముందు మా నాన్నతో ఒకసారి మాట్లాడు కార్తీక్. ఎలా ఉన్నాడో అంటుంది కాంచన. 

25
శివన్నారాయణకు అనుమానం వచ్చిందా?

శివన్నారాయణకు ఫోన్ చేస్తాడు కార్తీక్. సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు శివన్నారాయణ. ఏం తెలియలేదు. కానీ అత్త క్షేమంగా ఉంటుందని చెప్తాడు కార్తీక్. నీతోనే నువ్వు ఇచ్చిన ధైర్యం కూడా పోయిందిరా.. ఇప్పుడు ఈ ఇంట్లో అంతా చీకటే ఉంది అంటాడు శివన్నారాయణ. మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న. వదినకు ఏం కాదు అని చెబుతుంది కాంచన. నువ్వు నాలాగే మొండిదానివి కానీ.. మీ అన్నయ్య మనలా కాదు. అప్పుడు తల్లికోసం ఎలా ఏడ్చాడో.. ఇప్పుడు భార్యకోసం అలాగే ఏడుస్తున్నాడు అని చెప్తాడు శివన్నారాయణ. డబ్బు లేకుంటే కష్టాలు వస్తాయి అనుకున్నాను కానీ.. కష్టాలకు డబ్బుతో సంబంధం లేదని సంపాదించాకే తెలిసింది. ఈ వయసులో నాకు ఈ పరిస్థితి ఏంటని బాధపడుతాడు. 

ఇంతలో శౌర్య, అమ్మ.. నేను అమ్మమ్మ గదిలో పడుకోనా? నానమ్మ గదిలో పడుకోనా అని అడుగుతుంది. అది ఫోన్ లో విన్న శివన్నారాయణ చంటిది అమ్మమ్మ అంటుంది ఏంటి? అని అడుగుతాడు. కాంచన కవర్ చేస్తుంది. సరే అని ఫోన్ కట్ చేస్తాడు శివన్నారాయణ. తాతకు అనుమానం వచ్చిందా ఏంటి అని అంటాడు కార్తీక్. ముందు నేను అత్తతో మాట్లాడాలి అని లోపలికి వెళ్తాడు. 

35
జ్యో చెంప పగలకొట్టిన పారు

జ్యోత్స్న త్వరగా పడుకో.. ఉదయాన్నే లేచి మీ అమ్మ పేరు మీద గుడిలో పూజ చేయించాలి అంటుంది పారు. డాడీ, తాత నన్ను చాలా కోపంగా చూస్తున్నారు. అయినా మమ్మీ వెళ్లిపోయిన దగ్గరినుంచి నీకు నీ భర్తపై చాలా ప్రేమ పెరిగింది అంటుంది జ్యోత్స్న. నా ప్రేమ వేరు. పగ వేరు. అయినా ఇదంతా నీ వల్లే. నువ్వు మీ అమ్మను వెళ్లకుండా ఆపుంటే ఇదంతా జరిగేది కాదు అంటుంది పారు. నేనేమైన ఆమెను ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నానా? లేదా వెళ్లగొట్టానా? అయినా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మనకు మైనస్ కాదు గ్రానీ. తాత, డాడీ మమ్మీ కనిపించలేదనే బాధలోనే ఉంటారు. అప్పుడు నేను ఏది చెప్తే అదే జరుగుతుంది. సీఈఓ పోస్ట్ ఎక్కడికి పోదు అంటుంది జ్యోత్స్న. ఓ అవునా అంటూ జ్యోత్స్న చెంప చెల్లుమనిపిస్తుంది పారు. 

గ్రానీ అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్న. ఈ జన్మకు మారవ నువ్వు అంటుంది పారు. ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా.. తప్పు చేయి కానీ దానికి కారణం నువ్వు కాకూడదు. నువ్వే అయ్యావో దాన్ని వెంటనే సరిచేసుకోవాలి అని చెప్తుంది. సుమిత్ర విషయంలో నువ్వు తప్పు చేశావు. ఆ కార్తీక్ గాడు హీరో అవుతున్నాడు. నువ్వు విలన్ అవుతున్నావు. ఏదో ఒకటి చేసి మీ అమ్మను ఇంటికి తీసుకురా. తీసుకొచ్చే వరకు ఇంట్లోకి రాను అని చెప్పి వెతకడానికి వెళ్లు అని చెప్తుంది పారు. మీ అమ్మతో ఇంట్లోకి వస్తేనే నీకు పోయిన గౌరవం తిరిగివస్తుంది అని చెప్తుంది. మమ్మీ ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటుంది జ్యోత్స్న.

45
సుమిత్ర మనసు మార్చే ప్రయత్నం చేసిన కార్తీక్

సుమిత్ర గదిలోకి హాయ్ అత్త అనుకుంటూ వెళ్తాడు కార్తీక్. ఎంతసేపని ఇక్కడే ఉంటావు. అలా హాల్లోకి వెళ్దాం పదా అంటాడు. ఇప్పుడు నీకు ఎలా ఉందని అడగాలని ఉంది. కానీ నీ తలకు తగిలిన గాయం కంటే నీ మనసుకు తగిలిన గాయం పెద్దదని నాకు తెలుసు అంటాడు  కార్తీక్. నన్ను ఇక్కడి నుంచి పంపించెయ్ రా అంటుంది సుమిత్ర. ఎక్కడికి అంటాడు కార్తీక్. నన్ను గుర్తుపట్టని మనుషులు ఉన్న చోటుకి అంటుంది సుమిత్ర. మరి మేమంతా ఎక్కడికి పోవాలి అంటాడు కార్తీక్.

కొన్నిసార్లు మనల్ని ఎవరైనా బాధపెడితే మన కంట్లో నీళ్లు కనిపించకుండా మనం దూరం వెళ్లిపోతాం. కానీ తిరిగి చూస్తేనే కదా ఎదుటివారి కంట్లో కూడా నీళ్లు ఉన్నాయని మనకు కనిపించేది అంటాడు కార్తీక్. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అత్తా.. నీ మూడుముళ్ల బంధం నీకోసం ఎంత తపన పడుతుందో అర్థమవుతుంది అంటాడు. మాట్లాడు అత్తా.. నీకు ఏం కావాలో చెప్పు.. చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు కార్తీక్. నాకు ఏమి తెలియట్లేదు. మనస్ఫూర్తిగా ఉండలేకపోతున్నాను. ఏమి ఆలోచించలేకపోతున్నాను అంటుంది సుమిత్ర.

నీకు ఏం కాలేదత్తా మామయ్య దగ్గరికి వెళ్దాం పదా అంటాడు కార్తీక్. నేను రాను. ఆ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు అంటుంది సుమిత్ర. నువ్వు లేక ఆ ఇల్లు గంధరగోళంగా ఉంది. నీ కోసం వాళ్లంతా ఎదురుచూస్తున్నారు అంటాడు కార్తీక్. ఓర్పులో నువ్వు భూదేవివి అత్త. నువ్వే ఆగ్రహిస్తే ఎలా అంటాడు కార్తీక్. మామయ్య నీకోసం ఏడుస్తున్నాడు అని చెప్తుండగా సుమిత్ర తల పట్టుకొని పక్కకు పడిపోతుంది. రెస్టో తీసుకో అత్త అని బయటకు వెళ్లిపోతాడు కార్తీక్. 

55
నీ నాటకాలు ఆపరా..

అత్త మామూలు మనిషి కావాలంటే అత్తయ్య మామయ్య కలవాలి అంటాడు కార్తీక్. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను అమ్మ. ఇది ఇంకా ఎన్నిరోజులో అని మనసులో అనుకుంటుంది దీప. అమ్మతో మాట్లాడి నాన్నతో కలిసేలా చేయాలి. అమ్మ ఇక్కడే ఉందని వాళ్లకు తెలిస్తే మాకు మాటొస్తుంది అనుకుంటుంది దీప. ఇంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. సడెన్ గా ఇంట్లోకి వస్తాడు శివన్నారాయణ. మంచి చెడులు అడుగుతూనే కార్తీక్ లేడా అని గదిలోకి చూస్తాడు. కార్తీక్ కంగారుగా వచ్చి ఇక్కడే ఉన్నా తాత అని చెప్తాడు. కంగారులో తాత అన్నాను సారీ అని చెప్తాడు కార్తీక్. ఆపరా నీ నాటకాలు.. ఇంట్లో కూడా సార్ ఏంటి? తాత అంటే తప్పేంటి. అయినా కంగారు ఎందుకు అని అడుగుతాడు శివన్నారాయణ. 

అలవాటులో అనబోయి కంగారు అన్నాను తాత అని కవర్ చేస్తాడు కార్తీక్. ఎలా ఉన్నావు నాన్న.. ఇప్పుడే వచ్చావా అని అడుగుతుంది కాంచన. సుమిత్ర గురించి ఏమైనా తెలిసిందా.. మమ్మల్ని ధైర్యంగా ఉండమని నువ్వు ఎలా చెప్తున్నావు కార్తీక్ అంటాడు శివన్నారాయణ. అసలు సుమిత్ర మనకు దొరుకుతుందా అని శివన్నారాయణ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories