ఆహుతి ప్రసాద్, శివాజీ, జయప్రకాష్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఒక రోజు గ్యాప్ లో మహేష్ బాబు, తేజ కాంబినేషన్ లో వచ్చిన నిజం చిత్రం విడుదలయింది. మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ నిజం మూవీ ఏమాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో కొన్ని ఓవర్ డ్రమాటిక్ సీన్లు ఫ్యాన్స్ కి నచ్చలేదు. కానీ రాజశేఖర్ ఆయుధం మూవీ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.