Bigg Boss Telugu 9 Final List: అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కంటెస్టెంట్లు వీరే.. బిగ్‌ బాస్‌ బజ్‌ హోస్ట్ ఎవరంటే?

Published : Sep 06, 2025, 04:16 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 కంటెస్టెంట్ల ఫైనల్‌ అయిన జాబితా వచ్చేసింది. అలాగే అగ్నిపరీక్ష ద్వారా కన్ఫమ్‌ అయిన వారి జాబితా కూడా వచ్చేసింది. 

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 ప్రారంభానికి సర్వం సిద్ధం

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రియాలిటీ షో ప్రారంభానికి ఒక్క రోజే ఉంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల్‌ రెడీ షూట్‌ కూడా జరుగుతుంది. ఆరేడు మంది కంటెస్టెంట్ల డాన్స్ పర్‌ఫెర్మెన్స్ కూడా పూర్తయ్యింది. రీతూ చౌదరీ, శ్రష్టి వర్మ, భరణి, తనూజ, సంజనా గాల్రానీ డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో ఎంట్రీ ఇవ్వబోతున్నారట. మిగిలిన వారు ఏవీలతో రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఓపెనింగ్‌ ఈవెంట్‌కి సంబంధించిన షూట్‌ జరుగుతుంది.

25
అగ్నిపరీక్ష ద్వారా ఫైనల్‌ అయ్యింది వీరే

ఇదిలా ఉంటే అగ్నిపరీక్ష ద్వారా ఎంత మంది కంటెస్టెంట్లు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కామనర్స్ కోసం ఈ టెస్ట్ ని పెట్టిన విషయం తెలిసిందే. వేల అప్లికేషన్స్ రాగా ఇందులో 45 మందితో అగ్నిపరీక్ష షోని ప్రారంభించారు. వీరిలో నుంచి ఐదుగురుని ఎంపిక చేస్తారని అన్నారు. కానీ తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆరుగురు కామనర్స్ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి రాబోతున్నారు. ఈ ఆరుగురు ఎవరనేది ఫైనల్‌ అయ్యింది. దమ్ము శ్రీజ, పవన్‌ కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, హరీష్‌, మనీష్‌, ప్రియాలు ఫైనల్‌ అయ్యారట. ఆల్మోస్ట్ వీరే హౌజ్‌లోకి రాబోతున్నారని, ఒకవేళ ఐదుగురికే పరిమితం చేస్తే వీరిలో ఒకరిని కట్‌ చేసే ఛాన్స్ ఉందని సమాచారం.

35
బిగ్‌ బాస్‌ తెలుగు 9 కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే

సెలబ్రిటీ కంటెస్టెంట్లకి సంబంధించి తనూజా గౌడ, శ్రష్టి వర్మ, ఆషా సైనీ, ఇమ్మాన్యుయెల్‌, సంజనా గాల్రానీ, రీతూ చౌదరీ, భరణి, రాము రాథోడ్‌, సుమన్‌ శెట్టి ఓకే అయ్యారట. సెలబ్రిటీ కంటెస్టెంట్లు 9 మంది, కామనర్స్ ఆరుగురు, మొత్తం 15 మందిని హౌజ్‌లోకి పంపించబోతున్నట్టు సమాచారం. వీరంతా ఫైనల్‌ లిస్ట్. వీరి కాకుండా బలంగా వినిపించిన పేర్లలో అలేఖ్య చిట్టి పికిల్స్ గర్ల్స్ రమ్య, దేబ్జానీ, దీపికా, శివకుమార్‌, శ్రీతేజ, తేజస్విని గౌడ వంటి వారు కూడా వస్తారని సమాచారం. మరి వీరు ఇప్పుడే వస్తారా? వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ సారి స్వైపింగ్‌ ఉంటుందని సమాచారం. 

45
బిగ్‌ బాస్‌ 9 బజ్‌ హోస్ట్ గా శివాజీ

ఇక బిగ్‌ బాస్‌ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా, బిగ్‌ బాస్‌ బజ్‌ కూడా కీలకంగా ఉంటుంది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. దానికి హోస్ట్ ఎవరనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఆ హోస్ట్ ఫైనల్‌ అయ్యారట. శివాజీని ఓకే అయ్యారని సమాచారం. శివాజీ అంటే ఈ షోకి మరింత క్రేజ్‌ ఉంటుంది. ఆయన ఎవరినైనా ముక్కుసూటిగా ప్రశ్నిస్తారు. దీంతో రెగ్యూలర్‌ షో కంటే, ఈ బజ్‌ మరింత రసవత్తరంగా ఉండబోతుందని చెప్పొచ్చు.

55
స్టార్‌ మా, జీయో హాట్‌ స్టార్‌లో బిగ్‌ బాస్‌ తెలుగు 9 స్ట్రీమింగ్‌

ఈ సారి రెండు హౌజ్‌లు ఉంటాయట. ఈ రెండు హౌజ్‌ల్లోకి ఎవరెవరిని పంపిస్తారు? దాన్ని ఎలా మ్యానేజ్‌ చేస్తారు? ఆ ట్విస్టేంటి? అనేది చూడాలి. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ షో ఆదివారం(సెప్టెంబర్‌ 7)న ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్‌ మా, జియో హాట్‌ స్టార్‌లో లైవ్‌ ప్రసారం కానుంది. ప్రతి రోజు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ఈ షో స్టార్‌ మాలో టెలికాస్ట్ అవుతుంది. గంట పాటు చూపిస్తారు. శనివారం, ఆదివారం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. అలాగే జియో హాట్‌ స్టార్‌లో మాత్రం లైవ్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories