స్టార్ హీరో–హీరోయిన్ ప్రైవేట్ ఫొటోస్ లీక్.. 12 ఏళ్ల తర్వాత బయటపడ్డ అసలు నిజం..

Published : Sep 06, 2025, 04:06 PM IST

Ranbir- Katrina: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ లు టాక్ ఆఫ్ ది టౌన్. వీరిద్దరి ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆ ఫొటోలు ఎవరు తీశారు? ఎలా బయటపడ్డాయి? అనే విషయం 12 ఏళ్ల తర్వాత బయటపడింది.

PREV
15
బాలీవుడ్ లో దూమారం

Ranbir- Katrina: సినీ సెలబ్రెటీల లైఫ్ మనం ఊహించినంత ఈజీ కాదు. కెమెరాల కాంతుల్లో మెరిసే వారి గ్లామర్ లైఫ్ వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉంటాయి. ఎంత ఫేమస్ అయినా, వారి ప్రైవేట్ స్పేస్ మాత్రం చాలా చిన్నది. వారి ప్రతి కదలికపై నిఘా ఉంటుంది. వారు ఏం చేసిన మరు క్షణంలో వైరలవుతుంది. అలా ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. వీరిద్దరి ప్రైవేట్ ఫొటోలు బయటకు రావడంతో అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరు తీశారు? ఎలా బయటపడ్డాయి? అనే విషయం 12 ఏళ్ల తర్వాత బయటపడింది.  

25
ప్రైవేట్ వెకేషన్ ఫొటోలు లీక్..

బాలీవుడ్ స్టార్‌లు రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ లవ్‌స్టోరీ ఒకప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ జంట రిలేషన్‌లో ఉన్న రోజులలో, అంటే 2013లో స్పెయిన్‌లోని ఇబిజా బీచ్‌కి హాలిడే ట్రిప్‌కి వెళ్లారు. అక్కడ వీరిద్దరూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్న ప్రైవేట్ ఫొటోలు బయటకు రావడంతో అప్పట్లో బాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేశాయి. బికినీలో కత్రినా, స్విమ్ షార్ట్స్‌లో రణ్‌బీర్ ఉన్న ఆ ఫొటోలు ఒక మ్యాగజైన్‌లో పబ్లిష్ కావడంతో మీడియా, సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది.

35
రణ్‌బీర్, కత్రినా ఆగ్రహం

ఆ ఫొటోలు బయటకు రాగానే రణ్‌బీర్, కత్రినా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కత్రినా ప్రత్యేకంగా ఒక లేఖ విడుదల చేస్తూ.. మీడియాను కఠినంగా విమర్శించారు. “ఇది వ్యక్తిగత గోప్యతపై నేరుగా దాడి. వాణిజ్య ప్రయోజనాల కోసం ఇలా చేయడం అమానవీయ చర్య” అంటూ ఘాటుగా స్పందించారు. 

ఇక రణ్‌బీర్ కూడా ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “ మీ కుటుంబ సభ్యుల ప్రైవేట్ ఫొటోలు ఇలా లీక్ అయితే ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మాకూ అదే బాధ ఉంది ” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే బాలీవుడ్‌లో మీడియా హద్దులపై పెద్ద చర్చకు దారితీశాయి.

45
నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారా?

ఇన్నేళ్లుగా రహస్యంగానే మిగిలిపోయిన ఈ ఘటనపై తాజాగా కొత్త నిజం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ మానవ్ మంగ్లానీ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ రివీల్ చేశారు. బిగ్ బాస్ కాంటెస్టెంట్ కునిక్క సదానంద్‌తో మాట్లాడుతూ ఆయన సంచలన విషయాన్ని బయట పెట్టారు. మంగ్లానీ ప్రకారం.. ఆ ఫొటోలు ఎవరైనా పర్యాటకులు లేదా మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్లు తీసినవి కావు. 

అసలు నిజం ఏమిటంటే, రణ్‌బీర్–కత్రినాకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఆ ఫొటోలు లీక్ చేశాడని ఆయన బాంబ్ పేల్చారు. ఎవరు అనే పేరును ఆయన చెప్పకపోయినా, “నమ్మిన వారే వెన్నుపోటు పొడిచారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగ్లానీ ఇంకా మాట్లాడుతూ “ఏ విషయం అయినా ఈ రోజు కాకపోతే రేపే బయటకు వస్తుంది. స్టార్ జంటలు బయట తిరగకపోవడం అసాధ్యం. కానీ రణ్‌బీర్–కత్రినా ఇబిజా బీచ్ ఫొటోలు లీక్ కావడం వెనుక పర్యాటకులు కాదు. వాళ్లకు దగ్గరగా ఉన్నవారే ఉన్నారు” అని స్పష్టం చేశారు.

55
బాలీవుడ్‌లో మాయని మచ్చగా

రణ్‌బీర్–కత్రినా ఇబిజా వెకేషన్ ఫొటోలు లీక్ అవ్వడం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత సెలబ్రిటీల ప్రైవసీ, మీడియా హద్దులు, నమ్మకద్రోహం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఆ మిస్టరీ బయటపడటంతో మళ్లీ ఆ సంఘటనపై దృష్టి పడింది. 

ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కూతురి. వీరి కెరీర్ బిజీబిజీగా కొనసాగుతోంది. ఇక కత్రినా కైఫ్ 2021లో విక్కీ కౌశల్‌ను పెళ్లి చేసుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగింది. ఏదిఏమైనా ఫొటో లీక్ వివాదం బాలీవుడ్ చరిత్రలో మాయని మచ్చగానే మిగిలిపోయిందనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories