`ది రాజాసాబ్` టీజర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ కి ట్రీట్
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `రాజా సాబ్` మూవీ టీజర్ విడుదలయ్యింది. ఎప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు టీజర్‌ని ఇచ్చింది టీమ్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈ టీజర్ ని అభిమానులకు చూపించారు. అలాగే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తాజాగా విడుదలైన `రాజాసాబ్` టీజర్ ఆకట్టుకుంటుంది. ఊహకు మించి ఉంది.
మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ని ఆయన డీల్ చేయగలడా? హార్రర్ సినిమాలో ప్రభాస్‌ని ఎలా చూపిస్తారు? అనే డౌట్స్ ఉండేవి. కానీ సోమవారం విడుదల చేసిన టీజర్ మాత్రం మతిపోయేలా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది.
ముఖ్యంగా ఇందులో విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. వీఎఫ్‌ఎక్స్ షాట్స్ అదిరిపోయాయి. రాజావారి కోటా అద్భుతంగా ఉంది. మిగిలిన లొకేషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్ చూస్తుంటే సినిమాలో విజువల్స్ వేరే లెవల్ అని, అదే హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.
35
వింటేజ్ లుక్‌లో ప్రభాస్ రచ్చ
ఇక ఇందులో ప్రభాస్‌ని కామెడీగా చూపించిన తీరు బాగుంది. వింటేజ్ ప్రభాస్‌ని చూపించారు మారుతి. లవ్, రొమాన్స్, కామెడీ, భయం, ఫాంటసీ ఎలిమెంట్లు ఇలా అన్ని మేళవింపుగా ఉన్నాయి. ఫాంటసీ ఎలిమెంట్లతో కూడిన రొమాంటిక్ హర్రర్ కామెడీగా `రాజా సాబ్` టీజర్ ఆకట్టుకుంది. ఇది సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ క్రమంలో `రాజాసాబ్ 2`పై హింట్ ఇచ్చాడు దర్శకుడు మారుతి. `రాజా సాబ్` టీజర్ ఈవెంట్‌లో మాట్లాడుతూ పార్ట్ 2కి సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. రెండో పార్ట్ ని సినిమా కంప్లీట్ అయ్యాక నిర్ణయిస్తామని తెలిపారు. ఇంకా కన్ఫమ్‌గా అనుకోలేదని చెప్పారు. దీంతో పార్ట్ 2 ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.
అదే సమయంలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు మారుతి. పార్ట్ 2 ఉంటే ఫోర్స్ గా ఉండదని, దానికి సరైన కారణం, సరైన లీడ్ ఉంటుందన్నారు. ఏదో తీయాలి, ఏదో చేయాలనే ప్రమోషన్ స్టంట్ లాగా ఉండదని ఆయన వెల్లడించారు.
55
`పుష్ప 2`, `కల్కి`కి పోటీగా `రాజాసాబ్` నిడివి
దీంతోపాటు `రాజాసాబ్` నిడివిపై కూడా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి. సినిమా మూడు గంటలకు పైగానే ఉంటుందన్నారు. మొదట మూడున్నర గంటలు అని చెప్పి, ఏదో మాట వరుసకి అలా అన్నానని, మూడు గంటలకుపైగానే నిడివి ఉంటుందన్నారు. ఆ నిడివి ఇంకా ఫైనల్ కావాల్సి ఉందన్నారు.
దర్శకుడు చెప్పిన దానిప్రకారం `రాజాసాబ్` మూవీ నిడివి కూడా మూడు గంటలకుపైగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ లెక్కన `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ` సినిమాల తరహాలోనే `రాజాసాబ్` కూడా లాంగ్ నిడివితోనే రాబోతుందని అర్థమవుతుంది.