రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

First Published Jun 17, 2024, 12:20 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలో  నటించాలని స్టార్లు కూడా ఎదరు చూస్తుంటారు. అటువంటిది రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట ఓ స్టార్ హీరోయిన్.. ఎవరామె.. ? ఎందుకు రిజెక్ట్ చేసింది.  
 

Rajamouli

దర్శక శిఖరం  రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమాలో ఓ చిన్న పాత్ర కోసం స్టార్లు పోటీ పడుతుంటారు. అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటి జక్కన్న తానే స్వయంగా ఆఫర్ ఇస్తే వద్దనే వారు ఉంటారా..? ఉంటే వారిని ఏమనాలో కూడా అర్ధం కాదు. కాని ఓ స్టార్ హీరోయిన్ మాత్రం రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను నిక్కచ్చిగా రిజెక్ట్ చేసిందట. ఇంతకీ కారణం ఏంటో తెలుసా..? 
 

రజినీకాంత్ కు అవమానం.. అర్జున్ కూతురి పెళ్ళిలో ఇలా జరిగిందేంటి..? మండిపడుతున్న ఫ్యాన్స్..

రాజమౌళి సినిమాలో  నిమిషం కనిపించినా చాలు అనుకుంటుంటే.. అసలు ఆయన సినిమాలో నటించను అని చెప్పిన హీరోయిన్ ఎవరబ్బా అనే కదా మీ అనుమానం ఆమె ఎవరో కాతు స్టార్ హీరోయిన్ త్రిష. అవును  చెన్నై చిన్నది త్రిష. తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన త్రిషకు రాజమౌళి గురించి తెలిసి కూడా ఎందుకు రిజెక్ట్ చేసిందబ్బా అని అందరికి అనుమానం కలిగి ఉండవచ్చు. దానికి ఓ పెద్ద రీజన్ కూడా ఉందట. ఇంతకీ ఏంటా రీజన్. 

సానియా మీర్జ ఐటమ్ సాంగ్.. అవకాశం ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా..?

త్రిషను హీరోయిన్ గా రాజమౌళి ఆఫర్ చేసింది స్టార్ హీరో సినిమాకు కాదు.. కమెడియన్ గా కొనసాగున్న సునిల్ హీరోగా వచ్చిన మర్యాదరామన్న సినిమాకు. అవును ఈ సినిమా ఆఫర్ ముందుగా త్రిష దగ్గరకు వెళ్లిందట. కానీ త్రిష అప్పటికే స్టార్ హీరోయిన్. అవ్వడం.. ఎంత రాజమౌళి సినిమా అయినా సరే..కామెడియన్ గా తన సినిమాల్లోనే నటించిన సునిల్ పక్కన హీరోయిన్ గా నటించడానికి త్రిష సంకోచించిందని టాక్. అందుకే త్రిష ఈ ఆఫర్ ను ఆమె రిజెక్ట్ చేసిందని సమాచారం. 

బుడిబుడి అడుగులేస్తున్న క్లింకార.. ఎట్టకేలకు ఫాదర్స్ డే రోజు ఫేస్ రివిల్ చేసిన రామ్ చరణ్..

maryada ramanna

ఆ తర్వాత రాజమౌళి కూడా స్టార్ హీరోయిన్‌లను కాకుండా కొత్త అమ్మాయిని తీసుకుందామని ఫిక్సయిపోయి సలోనినీ తీసుకున్నారు. నిజానికి సలోనికి ఈ సినిమా జాక్ పాట్ అని, పెద్ద బ్రేక్ ఇస్తుందని అందరు అనుకున్నారు. కట్ చేస్తే.. అసలు ఇప్పడు ఆమె జాలేకుండాపోయింది ఇండస్ట్రీలో. మర్యాదరామన్న తరువాత సలోనీకి రెండు మూడు చిన్న సినిమాలు తప్పించి పెద్దగా ఆఫర్లు లేవు. అసలు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు.

SS Rajamouli reveals about his dream project

ఇక సరిగ్గా 14ఏళ్ల కిందట రిలీజై ‘మర్యాద రామన్నా’ ఊహించని రేంజ్‌లో హిట్టయింది. అప్పటికే ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘మగధీరా’ ఇలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన రాజమౌళి.. అనూహ్యంగా సునీల్ తో మర్యాద రామన్నా చేస్తున్నట్లు ప్రకటించి అందరకీ షాక్ ఇచ్చాడు. రాజమౌళికి ప్లాప్ రికార్డ్ లేదు. సునిల్ తో సినిమా అనేసరికి చాలామంది వద్దు అని సలహా ఇచ్చారట. ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్ చెడగొట్టుకోవద్దు అని అన్నారట. కాని హిట్ కొట్టి తీరతాను అని చెప్పిన జక్కన్న చేసి చూపించాడు. 

Sunil

అంతే కాదు సునిల్ ఈసినిమాతో హీరోగా ఫిక్స్ అయ్యాడు.. బంపర్ హిట్ కొట్టాడు. కేవలం 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ రన్ లో ఏకంగా .40 కోట్లకు పైగా కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్ లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇక ఈసినిమాకు త్రిష ఒప్పుకుని చేసుంటే ఏలా ఉండేదో మరి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేశాడు. త్వరలో ఈమూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. 

Latest Videos

click me!