రామ్‌చరణ్‌, నా మధ్య గొడవ పెట్టి ఎంజాయ్‌ చేసేవాడు.. బాబాయ్‌ పవన్‌ గురించి సుస్మిత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

Published : Jun 17, 2024, 11:47 AM IST

మెగా డాటర్‌ సుస్మిత కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆయన ఎంజాయ్‌ మెంట్‌ కోసం తమని వాడుకునేవాడని తెలిపింది సుస్మిత.  

PREV
16
రామ్‌చరణ్‌, నా మధ్య గొడవ పెట్టి ఎంజాయ్‌  చేసేవాడు.. బాబాయ్‌ పవన్‌ గురించి సుస్మిత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్

 చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. దీంతోపాటు కాస్ట్యూమ్‌ డిజైనింగ్‌గానూ రాణిస్తుంది. చిరంజీవికి చాలా సినిమాలకు ఆమెనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వర్క్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె నిర్మాతగా మారి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ద్వారా `పరువు` అనే వెబ్‌ సిరీస్ నిర్మించింది. ఇది జీ5లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

26

తాజాగా సుస్మిత పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడింది. తన సంతోషాన్ని పంచుకోవడంతోపాటు, ఆయన గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. బాబాయ్‌ ని తనకు పెద్ద అన్నలాంటి వాడు అని, ఆయన్ని బాబాయ్‌గా ఎప్పుడూ చూసేవాళ్లం కాదు, అన్నలాగా భావించామని చెప్పింది సుస్మిత. 
 

36
Pawan Kalyan

రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు, కానీఎప్పుడైనా సక్సెస్‌ అవుతాడని భావించాం. ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీలో ఆనందానికి అవదుల్లేవ్‌. ఒక సెలబ్రేషన్‌ మూడ్‌లో ఉన్నామని తెలిపింది సుస్మిత కొణిదెల. 
 

46

ఈ సందర్భంగా బాబాయ్‌ పవన్‌తో అనుబంధం గురించి చెబుతూ, చిన్నప్పుడు మమ్మల్ని బాగా ఆటపట్టించేవాడట. రామ్‌చరణ్‌, నా మధ్య గొడవలు పెట్టేవాడు. మేం గొడవలు పడుతుంటే ఆయన ఎంజాయ్‌ చేసేవాడు. ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం మమ్మల్ని వాడుకునేవాడు. అలాంటి నాటీ, చిలిపి యాంగిల్‌ కూడా బాబాయ్‌లో ఉంది` అని తెలిపింది సుస్మిత.
 

56

అంతేకాదు సరదా పార్ట్ పక్కన పెడితే ఎప్పుడూ ఓ ఐడియాలిజీతో, ఒక ఎయిమ్‌తో ఉండేవాడు. జనాల కోసం, జీవితంలో ఎలా ఉండాలనేది ఆలోచించేవాడు. స్వేచ్ఛగా ఉండటం, స్వేచ్ఛగా ఆలోచించడం ఆయనకే సాధ్యం అని తెలిపారు. ఆయన పదేళ్లు చాలా కష్టపడ్డాడు. నిరంతరం పోరాడాడు. ఇప్పుడు సాధించాడని తెలిపింది సుస్మిత కొణిదెల. 
 

66

పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఘన విజయం సాధించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు తనపార్టీ నుంచి నిలబెట్టిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories