మహేష్ మేనకోడలు ఇంత గొప్ప అందగత్తెనా? పక్కా హీరోయిన్ మెటీరియల్ చూశారా!

First Published Jun 17, 2024, 11:22 AM IST

మహేష్ బాబు మేనకోడలిని ఎప్పుడైనా చూశారా? చూస్తే మీ మతులు పోవడం ఖాయం. అందంలో మహేష్ ని తలదన్నేలా ఉంది. పక్కా హీరోయిన్ మెటీరియల్ ఆమె... 
 

దేశంలోనే అందమైన హీరోగా మహేష్ బాబుకి పేరుంది. మిల్కీ బాయ్ అని అమ్మాయిలు ముద్దుగా పిలుచుకుంటారు. సూపర్ స్టార్ కృష్ణ అందాన్ని మహేష్ బాబు పుణికి పుచుకున్నాడు. ఇక కృష్ణ వారసులు కూడా అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. 
 

Mahesh Babu Niece Jaanvi


కృష్ణకు ముగ్గురు కుమార్తెలు కాగా మంజుల ఘట్టమనేని ఒకరు. ఈమె నటి కూడాను. షో అనే ప్రయోగాత్మక చిత్రంలో మంజుల హీరోయిన్ గా చేసింది. నీలకంఠ దర్శకత్వం వహించిన షో చిత్రంలో రెండు పాత్రలే ఉంటాయి. ఈ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. 
 

Mahesh Babu Niece Jaanvi


మంజుల కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఆమె నిర్మాత రాణించారు. మహేష్ హీరోగా నటించిన నాని, పోకిరి చిత్రాలకు నిర్మాతగా ఆమె ఉన్నారు. మనసుకు నచ్చింది అనే చిత్రానికి దర్శకత్వం వహించింది. మంజుల భర్త స్వరూప్ కాగా ఆయన కూడా నటుడే. 
 

Mahesh Babu Niece Jaanvi


మంజులకు ఒక అమ్మాయి. పేరు జాన్వీ. వరసకు మహేష్ కి మేనకోడలు అవుతుంది. కాగా జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందంలో జాన్వీ అచ్చు మహేష్ బాబునే. ఆయనకు పోటీ ఇచ్చేలా ఉంది. 
 

ప్రస్తుతం జాన్వీ టీనేజ్ లో ఉంది. చదువు పూర్తి అయిన వెంటనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. జాన్వీ ఫోటోలను మంజుల అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. దాంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి. 
 

ఇక కృష్ణ వారసుల్లో సితార దూసుకుపోతుంది. 12 ఏళ్ల వయసుకే సితార సంచనాలు చేస్తుంది. సితారకు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సితార ఓ యాడ్ లో కూడా నటించింది. అందుకు గాను ఆమె కోటి రూపాయలు తీసుకున్నారని సమాచారం. ఈ డబ్బును ఆమె ఛారిటీకి ఖర్చు చేశారట. 

సితార తరచుగా ఫోటోలు, డాన్స్ వీడియోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. సితార డాన్స్ కూడా నేర్చుకుంటుంది. అనీ మాస్టర్ తో కలిసి డాన్స్ చేస్తున్న పలు వీడియోలు సితార ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం విశేషం. 

Latest Videos

click me!