రాధిక అల్లుడు ఒక స్టార్ క్రికెటర్ అని మీకు తెలుసా? ఇంతకీ ఎవరా స్టార్ ప్లేయర్ ?

మాజీ హీరోయిన్, స్టార్  నటి రాధికా శరత్‌కుమార్ అల్లుడు ఒక క్రికెట్ క్రీడాకారుడు అని ఎంత మందికి తెలుసు? ఇంతకీ అతను ఎవరు? ఆ స్టార్ క్రికెటర్ ఆడిన మ్యాచ్‌ల గురించి చూద్దాం.

Radhika Sarathkumars Son in Law Star Indian Cricketer Abhimanyu Mithun

 రాధిక 1980లలో సౌత్  సినిమాలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు  ఆమె మొదట నటుడు ప్రతాప్ పోతన్‌ను వివాహం చేసుకుంది. అతనితో విడాకుల తర్వాత, ఆమె విదేశీయుడైన రిచర్డ్ హార్డీని వివాహం చేసుకుంది. ఈ జంటకు రాయనే అనే కుమార్తె ఉంది. ఆ తర్వాత రిచర్డ్‌ తనను టార్చర్ పెడుతున్నాడని ఇండియాకు తిరిగి వచ్చింది రాధిక. రిచర్డ్ కి  విడాకులు ఇచ్చి ఆ తర్వాత నటుడు శరత్‌కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు.

Also Read:  బాహుబలి సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో, ప్రభాస్ కంటే ముందు రాజమౌళి ఆఫర్ ఇచ్చింది ఎవరికి?

నటి రాధికా అల్లుడు ఒక క్రికెట్ క్రీడాకారుడు. అతని పేరు అభిమన్యు మిథున్. రాధిక కుమార్తె రాయనే అతన్ని వివాహం చేసుకుంది. 2016లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాధిక అల్లుడు అభిమన్యు మిథున్ భారత క్రికెట్ జట్టుకు కూడా ఆడాడు. దీనితో పాటు, అభిమన్యు మిథున్ ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఆర్సీబీ మరియు ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.

Also Read:  500 మంది ఫైటర్లు, 3,000 మంది ఆర్టిస్టులు, ఒక్క సీన్ కోసం కోట్లు ఖర్చుచేస్తున్న సినిమా ఏంటో తెలుసా?


అభిమన్యు మిథున్ 2010లో భారత జట్టులో ఆడాడు. అతను భారత జట్టులో అవకాశం పొందడానికి ప్రధాన కారణం 2009లో జరిగిన రంజీ ట్రోఫీ టోర్నమెంట్. కర్ణాటక జట్టు తరపున ఆడిన మిథున్ తన తొలి మ్యాచ్‌లోనే 11 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. అందులో ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. ఈ సిరీస్ అంతటా అద్భుతంగా ఆడిన మిథున్ మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు. దీంతో వెంటనే అతనికి భారత జట్టులో ఆడే అవకాశం వచ్చింది.

Also Read: పెళ్లైన 4 నెలలకు తమిళ హీరోతో జోడి కట్టబోతున్న శోభిత ధూళిపాళ

భారత జట్టు తరపున 5 టెస్టులు మరియు 6 వన్డేలు ఆడిన అభిమన్యు మిథున్, ఐపీఎల్ టోర్నమెంట్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున 2009 నుండి 2013 వరకు ఆడాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసి, ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన మిథున్‌ను ఎక్స్‌ప్రెస్ బౌలర్ అని పిలిచేవారు. ఆ తర్వాత 2015లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మిథున్‌కు భారత జట్టులో ఆడే అవకాశం రాకపోవడంతో 2021లో క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు.

Also Read:  ఛావా రికార్డు బ్రేక్ చేసిన సౌత్ మూవీ? కాంట్రవర్సీ అయ్యి కూడా కలెక్షన్లు దండుకుంటున్న సినిమా ఏది?

Also Read: మోక్షజ్ఞ కోసం మరో స్టార్ డైరెక్టర్, ఫస్ట్ సినిమా ఎవరితో? బాలయ్య ఏం ప్లాన్ చేశారు?

Latest Videos

vuukle one pixel image
click me!