స్లీవ్‌ లెస్ డ్రెస్‌లో చిరుత పులిలా మెరిసిపోతున్న రాశీఖన్నా.. స్లిమ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న అందాలు

Aithagoni Raju | Published : Jul 19, 2023 5:38 PM
Google News Follow Us

రాశీఖన్నా.. కెరీర్‌ పరంగా బిగ్‌ టర్న్ తీసుకుంటుంది. ఇన్నాళ్లు కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటూ వచ్చిందీ అందాల భామ. కానీ ఇప్పుడు ఆమె కెరీర్‌ పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అది ఏ వైపు వెళ్తుందనేది సస్పెన్స్ గా మారింది. 
 

17
స్లీవ్‌ లెస్ డ్రెస్‌లో చిరుత పులిలా మెరిసిపోతున్న రాశీఖన్నా.. స్లిమ్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌  చేస్తున్న అందాలు

రాశీఖన్నా.. హీరోయిన్ గా అలరించడమే కాదు, అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ షాకిస్తుంది. ఈ బ్యూటీ చాలా సందర్బాల్లో షాకింగ్‌ లుక్‌లో మెరిసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్‌ చేసింది. అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని బ్లాస్ట్ చేసింది. తాజాగా అదిరిపోయే లుక్‌లో మెస్మరైజ్‌ చేస్తుంది రాశీ. నయా లుక్‌లో కేక పెట్టిస్తుంది.
 

27

రాశీఖన్నా.. చిరుతపులిలా మారిపోయింది. చిరుత పులి లాంటి డ్రెస్ వేసుకుని ఆకట్టుకుంటుంది. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ముంబయిలో నిన్న రాత్రి జరిగిన `బవాల్‌` సెలబ్రిటీ ప్రీమియర్‌లో రాశీఖన్నా పాల్గొని స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అందాల విందుతో ఆకట్టుకుంటుంది. 
 

37

బొద్దుగా ఉండే ఈ భామ ఇటీవల బాగా తగ్గిపోయింది. స్లిమ్‌ గానూ మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. వారిని కనువిందు చేస్తున్నాయి. చిలిపి నవ్వులతో సైలెంట్గా కిల్‌ చేస్తుందీ బొద్దుగుమ్మ. 
 

Related Articles

47

రాశీఖన్నా..కి ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. ఆమె గ్యాపిచ్చిందా? ఆమెకి గ్యాపిచ్చారా? అనేది సస్పెన్స్ కానీ, ఈ అమ్మడి కెరీర్‌ ఇటీవల ఊహించని మలుపు తిరిగినట్టుగా అనిపిస్తుంది. నిజానికి `ఫర్జీ` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది రాశీఖన్నా. ఇందులో పవర్‌ఫుల్‌ రోల్‌ చేసింది. దీనితో పాన్ ఇండియా హీరోయిన్‌ అయిపోయిందని భావించారు. అవకాశాలు వస్తాయని ఊహించారు కానీ సీన్‌ రివర్స్ అయ్యింది. 
 

57

ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో రెండు సినిమాలు, హిందీలో ఓ సినిమా చేసింది. ఇవి గతంలో ఒప్పుకున్న చిత్రాలు. కొత్తగా ఇప్పటి వరకు రాశీ మరే సినిమాని ప్రకటించలేదు. దీంతో ఇది ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఆమె ఆచితూచి వ్యవహరిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 
 

67

ఇక `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది రాశీఖన్నా. తొలి చిత్రంతోనే అందరి దృష్టిన ఆకర్షించింది. కొత్త అందం సూపర్‌ అన్నారు. అవకాశాలు వెంటపడ్డాయి. `జోరు`, `జిల్‌`, `బెంగాల్‌ టైగర్‌`, `సుప్రీమ్`, `హైపర్‌`, `ఆక్సిజన్‌`, `టచ్‌ చేసి చూడు`, `తొలి ప్రేమ`, `శ్రీనివాస కళ్యాణం`, `వెంకీ మామ`, `ప్రతి రోజు పండగే`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`, `పక్కా కమర్షియల్‌`, `థ్యాంక్యూ` చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. 
 

77

రాశీఖన్నా.. కెరీర్‌ పరంగా బిగ్‌ టర్న్ తీసుకుంటుంది. ఇన్నాళ్లు కమర్షియల్‌ సినిమాలు చేసుకుంటూ వచ్చిందీ అందాల భామ. కానీ ఇప్పుడు ఆమె కెరీర్‌ పరంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అది ఏ వైపు వెళ్తుందనేది సస్పెన్స్ గా మారింది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos