బిగ్ బాస్ తెలుగు 9 లో పుష్ప 2 సింగర్, ఫోక్ సాంగ్స్ తో హౌస్ లో మోత మోగించబోతున్న గాయని ?

Published : Jul 15, 2025, 02:42 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో ఫోక్ సాంగ్స్ తో మోత మోగబోతుంది. గత సీజనల్లో కొంత మంది ఫోక్ సింగర్స్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఫేమస్ జానపదగాయని అడుగు పెట్టబోతున్నారు. ఇంతకీ ఎవరామె? 

PREV
15

టెలివిజన్ ప్రపంచంలో టాప్ రియాలిటీ షో అంటే బిగ్ బాస్ పేరు ముందుంటుంది. బాలీవుడ్ లో స్టార్ట్ అయిన ఈ షో, తెలుగులో ఎంట్రీ ఇచ్చి, ఇప్పటికే ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్‌కు రంగం సిద్ధం అవుతుంది. దాదాపు 100 రోజుల పాటు నడిచే ఈ షోలో సామాన్యులు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ప్రభావం కలిగిన వ్యక్తులు పాల్గొంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

25

రీసెంట్ గా బిగ్ బాస్ 9కు సంబంధించిన ఫస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. అంతే కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంబంధించి బిగ్ బాస్ టీమ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాలేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లతో కొన్ని లిస్ట్ లు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలు ఎవరెవరు రాబోతున్నారో చెపుతూ.. ఎవరి విశ్లేషణ వారు ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేర్లు వైరల్ అవుతుండగా, తాజాగా మరో పైరు కూడా వినిపిస్తుంది. ఓ జానపద గాయని హౌస్‌లోకి అడుగుపెట్టనుందనే వార్తలు సోషల్ మీడియా హల్ చల్ చేస్తోంది.

35

ఇంతకీ ఆమె ఎవరో కాదు, నిర్మల్ జిల్లా ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన లక్ష్మి. చిన్ననాటి నుంచి పాటలపై ఆసక్తి ఉన్న లక్ష్మి, ఫోక్ సాంగ్స్ ద్వారా విపరీతమైన గుర్తింపు పొందింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన పుష్ప 2 సినిమాలో “ వస్తున్నాయ్ ఫీలింగ్స్ పాటతో బాగా ఫేమస్ అయింది లక్ష్మి. 

అంతకంటే ముందు తిన్నా తీరం పడుతలే.. కూసున్నా తీరం పడుతలే, ఆనాడేమన్నంటినా తిరుపతి వంటి జానపద పాటలు లక్ష్మీకి మంచి పేరు తీసుకురావడంతో పాటు సెలబ్రిటీని చేశాయి. 

యూట్యూబ్‌ లో మిలియన్ల వ్యూస్‌ను రాబట్టిన ఈ పాటలు, లక్ష్మికి సినిమా రంగంలో పాడే అవకాశాలను తెచ్చిపెట్టాయి. ఆమె బ్యాచ్, దసరా సినిమాల్లో పాటలు పాడారు. ఆమె పాడిన పాటలకు అద్భుతమైన స్పందన కూడా అందుకుంది.

45

ఇలాంటి సమయంలో లక్ష్మీ బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వెళ్లనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ విషయంపై స్వయంగా లక్ష్మీ స్పందిస్తూ, "బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. నా భర్త, ఏడాదిన్నర వయస్సు ఉన్న నా కుమారుడే నా ప్రపంచం. వారిని విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లలేను," అని తెలిపింది. అంతేకాక, దుబాయ్‌, మస్కట్‌ వంటి దేశాల్లో ప్రోగ్రామ్స్‌కి కూడా వెళ్లలేకపోయిన విషయాన్ని ఆమె వెల్లడించింది.

55

బిగ్ బాస్‌ను నేను చూస్తూ ఉంటాను. అవకాశం వస్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, అని చెప్పింది లక్ష్మి, కాని గ్యారెంటీగా వెళ్తానని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇక లక్ష్మీ చివరకు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెడతారా లేదా అన్నది మాత్రం చూడాలి.ప్రస్తుతం బిగ్ బాస్ 9 ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా ఈ సీజన్ ను కింగ్ నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఆయన యాంకర్ గా కొనసాగుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories