చేసేది కామెడీ, ఆస్తులేమో వందల కోట్లు.. బ్రహ్మానందం ఆస్తుల విలువ తెలిస్తే షాకే

Published : Jul 15, 2025, 01:37 PM IST

అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మానందం వద్ద ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

PREV
15
నవ్వులు రారాజుగా వెలుగుతున్న బ్రహ్మానందం

హాస్యానికి మారుపేరు, నవ్వులకు పర్యాయపదంగా నిలుస్తోన్న బ్రహ్మానందం గత నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై నవ్వులు రారాజుగా వెలుగుతున్న విషయం తెలిసిందే. 

హాస్య బ్రహ్మగా పిలుపించుకుంటున్న ఆయనకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా ఆస్తుల మ్యాటర్‌ చర్చనీయాంశం అయ్యింది. 

25
అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా బ్రహ్మానందం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు బ్రహ్మానందం. ఆయన వయసు 68 సంవత్సరాలు. 20వ ఏట నుంచే నటించడం ప్రారంభించారు.

1050కు పైగా చిత్రాలలో నటించి, నేటికీ బిజీగా ఉన్న బ్రహ్మానందం అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ రికార్డు సాధించారు. 1986లో విడుదలైన `చంటబ్బాయి` అనే చిత్రంతో ఆయన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

35
అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్‌ బ్రహ్మానందం

ఒకానొక సమయంలో సంవత్సరానికి 30 సినిమాల్లో నటించారంటే అతిశయోక్తి కాదు. తెలుగులో ఆల్మోస్ట్ అన్ని బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లోనూ ఆయన నటించి మెప్పించారు. కంటిన్యూగా నవ్వులు పూయిస్తూనే ఉన్నారు. 

బ్రహ్మానందం ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటి నుండి 2.5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు.  అత్యధిక పారితోషికం తీసుకునే కమెడియన్‌గా రాణిస్తున్న బ్రహ్మానందం. 

45
కమెడియన్లలో అత్యంత కుబేరుడు బ్రహ్మానందం

హీరోగా నటించకపోయినా, 68 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా, బహుభాషా చిత్రాలలో నటిస్తున్న బ్రహ్మానందం ఆస్తులకు సంబంధించిన సమాచారం లీక్‌ అయ్యింది.  నవ్వులతోనే వందల కోట్లు సంపాదించారట. 

ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు రు.490 కోట్లుగా అంచనా. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన హాస్యనటుడు బ్రహ్మీ కావడం విశేషం. నటనతో పాటు చిత్రలేఖనంలో కూడా ఆయన ప్రావీణ్యం సంపాదించారు.

55
బ్రహ్మానందం జోరు తగ్గింది

గత ఐదారేళ్ల వరకు బిజీగా రాణించిన ఆయన ఇటీవల జోరు తగ్గింది. కొత్త కమెడియన్లు రావడంతో బ్రహ్మానందానికి అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో కామెడీ పాత్రలే ఇన్నాళ్లు చేస్తూ వచ్చాను, ఇప్పటికైనా కొత్తగా, డిఫరెంట్‌ రోల్స్ చేయాలని ఉందని బ్రహ్మానందం తెలిపారు. 

అందుకే రెగ్యూలర్‌ కామెడీ రోల్స్ చేయడం లేదన్నారు. ఈ క్రమంలో ఆ మధ్య `రంగమార్తాండ` చిత్రంలో ఎమోషనల్‌ రోల్‌చేశారు బ్రహ్మీ. చివర్లో కన్నీళ్లు పెట్టించారు. ఇప్పుడు అలాంటి విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు బ్రహ్మీ. మరి మున్ముందు ఎలాంటి పాత్రలతో అలరిస్తారో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories