అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ సినిమాకు జపాన్‌లో ఊహించని షాక్ తగిలింది. మంచి ప్రమోషన్లతో.. జపాన్ ఆడియన్స్ ముందుకు వెళ్లిన సినిమాకు అక్కడ ఎలాంటిస్పందన వచ్చిందంటే?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప 2: ది రూల్. ఇండియాలో సంచలనంగా మారిన ఈసినిమా.. ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా.. జనవరి 16న జపాన్ లో రిలీజ్ అయ్యింది మూవీ. కానీ అక్కడ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మూవీ. స్థానిక ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టలేకపోయింది. భారీ ప్రచారం, విడుదలకు ముందు అల్లు అర్జున్ టోక్యోలో ఉన్నప్పటికీ, మొదటి రోజు పెద్దగా జనం రాలేదు. ఇది పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
25
పుష్ప2 సినిమాకు షాక్..
సాక్నిల్క్ అందించిన గణాంకాల ప్రకారం, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2, జపాన్‌లో మొదటి రోజు కేవలం 886 అడ్మిషన్లు మాత్రమ పొందింది. RRR (8,230), సాహో (6,510), కల్కి 2898 AD (3,700) వంటి సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
35
జపాన్ లో నిలబడలేకపోయిన అల్లు అర్జున్ సినిమా..
జపనీస్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో, పుష్ప 2 జపాన్‌లో టాప్ ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలవలేకపోయింది. RRR విజయం తర్వాత భారత సినిమాలపై ఆసక్తి పెరిగినా, ఈ సినిమాకు పేలవమైన ఆరంభం దక్కింది. అల్లు అర్జున్ స్టార్ పవర్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నా, జపాన్‌లో టికెట్ అమ్మకాలకు అవి ఉపయోగపడలేదు.
యాక్షన్ సీక్వెన్స్‌లను పట్టించుకోని జపాన్ ఆడియన్స్..
పుష్ప 2లో హై-ఎనర్జీ యాక్షన్ సీక్వెన్స్‌లు, అల్లు అర్జున్ స్టార్ పవర్ ఉన్నా, జపాన్‌లో టికెట్ అమ్మకాలు పెరగలేదు. జపాన్‌లో నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇతర అంతర్జాతీయ ప్రాంతాల్లో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
55
ఇండియాలో పుష్ప2 కలెక్షన్స్
ప్రపంచవ్యాప్తంగా, పుష్ప 2: ది రూల్ రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యంత విజయవంతమైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రాబోయే వారాల్లో జపాన్‌లో ఈ సినిమా ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఒక ప్రాంతంలో విజయం సాధించినంత మాత్రాన, మరోచోట అదే ఫలితం రాదని పుష్ప 2 జపాన్ విడుదల వల్ల తెలిసి వచ్చింది.