టాలీవుడ్ హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్ చేశారు. తనకంటూ ఎవరు లేరని ఎమోషనల్ అయ్యారు రేణు. ఇంతకీ ఆమె ఎందుకు ఇలా బాధపడ్డారంటే?
టాలీవుడ్ నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టు సంచలనంగా మారింది. తన కంటూ ఎవరు లేరని.. ఎవరు తనను కాపాడరని ఎమోషనల్ అవ్వడం.. అందరిని షాక్ కు గురిచేసింది. వీధి కుక్కలను చంపే ఘటనలపై రేణు దేశాయ్ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు కూడా వేశారు. కుక్కలతో పాటు ఇతర మూగ జీవాలవి కూడా ప్రాణాలే కాదా? అని ప్రశ్నించారు. మనుషులతో పాటు అన్ని జీవులకు జీవించే హక్కు ఉందని ఆమె స్పష్టం చేశారు.ఈ ప్రెస్‌మీట్ తర్వాత తనపై కొందరు విమర్శలు చేస్తున్నారని, రకరకాల మాటలు అంటున్నారని రేణు దేశాయ్ తెలిపారు.
అయినప్పటికీ తాను వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గంగా నదిలో పడవలో వెళ్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. “నన్ను రక్షించడానికి నాకు తండ్రి గానీ, తల్లి గానీ, అన్నయ్య గానీ, భర్త గానీ లేరు. నా తప్పు ఏమీ లేకపోయినా మీరు నాపై కురిపించే ద్వేషాన్ని నేను ప్రశాంతంగా ఆ దేవికి, మహాదేవునికి చెబుతాను. వారు నా బాధను వింటారని, నా కన్నీళ్లను చూస్తారని నాకు తెలుసు” అని ఎమోషనల్ కామెంట్స్ చేసింది రేణు.
24
మూగజీవాల గురించి పోరాటం..
రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు పెద్దచర్చకు దారి తీసింది. చాలా కాలంగా మూగజీవాల కోసం ఆమె పోరాటం చేస్తోంది. కుక్కలతో పాటు ఇతర మూగ జీవాలవి కూడా ప్రాణాలే కాదా? అని తాజా ప్రెస్ మీట్ లో ఆమె ప్రశ్నించారు. మనుషులతో పాటు అన్ని జీవులకు జీవించే హక్కు ఉందని.. దోమల కారణంగా, రోడ్డు ప్రమాదాల వల్ల, హత్యలు , అత్యాచారాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ, వీధి కుక్కల విషయంలో మాత్రమే ఎందుకు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని రేణు ప్రశ్నించారు. , తనకు తెలిసిన ఒక చిన్నారి డెంగ్యూతో మరణించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. రోజూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నవారి ప్రాణాలకు విలువ లేదా..? కేవలం కుక్క కాటుతో మనిషి చనిపోతేనే స్పందించడమేమిటని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.
చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు ఎందుకు అంతగా స్పందించడం లేదని అందరిని రేణు దేశాయ్ ప్రశ్నించారు. ఒక చిన్నారిని కుక్క చంపితే ఆ కుక్కను చంపేస్తున్నారు.. మరి చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తిని ఎందుకు చంపడం లేదని ఆమె అడిగారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రజలు చనిపోతున్నారు, కానీ దాని కోసం ఎవరూ నిరసనలు తెలుపడం లేదు, ప్రజలు కాలభైరవుడని పూజిస్తూనే.. కుక్కలను చంపడం ఎంతవరకు సరైందని రేణు అన్నారు. తన మాటలు చాలా మందికి కోపం తెప్పించవచ్చని, అయినా తాను భయపడనని ఆమె స్పష్టం చేశారు.
తాను తన వ్యక్తిగత హక్కుల కోసంఎప్పుడూ పోరాటం చేయలేదని రేణు దేశాయ్ అన్నారు. కొన్ని కుక్కలు పిల్లలను చంపాయని.. అన్ని కుక్కలను చంపేయడం ఎంత వరకూ న్యాయం, అమాయక కుక్కలని చంపడం తప్పని అందరికీ అర్థమయ్యే వరకు తన వాయిస్‌ను వినిపిస్తూనే ఉంటానని రేణు దేశాయ్ తెలిపారు. తనను ఎంత మంది విమర్శించినా, ద్వేషపూరితంగా మాట్లాడినా పరవాలేదని, తన బాధను ఎవరితో పంచుకోవాలి తనకు తెలుసన్నారు రేణు. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్” అని ఆమె పోస్టు ముగించారు.