Ram Charan: ప్రభాస్‌ వదులుకున్న బ్లాక్‌ బస్టర్‌.. రామ్‌ చరణ్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిన సినిమా ఏంటో తెలుసా?

Published : Jan 21, 2026, 07:57 AM IST

ప్రభాస్‌ వదులుకున్న మూవీతో రామ్‌ చరణ్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఓ రకంగా ఈ చిత్రం ఆయనకు సెకండ్‌ లైఫ్‌ని ఇచ్చిందని చెప్పొచ్చు. మరి ఆ సినిమా ఏంటో చూద్దాం. 

PREV
15
ప్రభాస్‌ వదులుకున్న సినిమాతో చరణ్‌ సెకండ్‌ లైఫ్‌

ప్రభాస్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌. ఇంకా చెప్పాలంటే గ్లోబల్‌ స్టార్‌. ఆయన నటించిన డిజాస్టర్‌ మూవీస్‌ కూడా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయంటే ఆయన రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే కొన్ని  భారీగా డిజాస్టర్‌ కావడంతో నిర్మాతలు మాత్రం కుదేలవుతున్నారు. ప్రభాస్‌తో సినిమా భారీ వసూళ్లు మాత్రమే కాదు, భారీ నష్టాలను కూడా తెస్తాయి. అదే ఇప్పుడు పెద్ద సమస్య. అయితే ప్రభాస్‌ వదులుకున్న మూవీతో రామ్‌ చరణ్‌ బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఆయనకు  ఓరకంగా సెకండ్‌ లైఫ్‌ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ మూవీ ఏంటి? ఆ కథేంటో తెలుసుకుందాం. 

25
కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా `తని ఒరువన్‌`

ప్రభాస్‌ రేంజ్‌ `బాహుబలి`తో మారిపోయింది. ఆయన బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగారు. అదే రేంజ్‌లో ఇప్పుడు ఆయన సినిమాలుంటున్నాయి. అయితే డార్లింగ్‌ తన కెరీర్‌ చాలా హిట్‌ సినిమాలు, బ్లాక్‌ బస్టర్స్ వదులుకున్నారు. అలా వదులుకున్న చిత్రాల్లో `తనిఒరువన్‌` కూడా ఉంది. ఇది తమిళంలో రూపొందిన చిత్రం. దర్శకుడు మోహన్‌ రాజా ఈ సినిమాని రూపొందించారు. తన తమ్ముడు రవి మోహన్‌, నయనతార కాంబోలో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో అరవింద స్వామి విలన్‌ రోల్‌ చేశారు. ఇది స్టయిలీష్‌ యాక్షన్‌ మూవీగా చెప్పొచ్చు. మైండ్‌ గేమ్‌తో నడుస్తుంది. ఇది 2015లో విడుదలై  కోలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. దాదాపు రూ.150కోట్లు వసూలు చేసిందని అంచనా. అప్పట్లో ఈ కలెక్షన్లు అంటే ఇండస్ట్రీ హిట్‌గా చెప్పుకోవచ్చు.

35
`తని ఒరువన్‌`ని రిజెక్ట్ చేసిన ప్రభాస్‌

అయితే ఈ సినిమా కథని మొదట దర్శకుడు మోహన్‌ రాజా.. హీరో ప్రభాస్‌ కోసమే రాసుకున్నారట. ఆయనతో చేయాలనుకున్నారు. చాలా ప్రయత్నించారు. కానీ అప్పుడు ప్రభాస్‌.. రాజమౌళి కి కమిట్‌ అయ్యారు. ఆయన `బాహుబలి` సినిమాలను తీస్తున్నారు. వాటికే దాదాపు ఐదేళ్లు కేటాయించారు ప్రభాస్‌. దీంతో `తనిఒరువన్‌` చేయలేకపోయారు.  అలా ఈ మూవీని వదులుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాని రవి మోహన్‌ చేసి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకొని బౌన్స్ బ్యాక్‌ అయ్యారు.

45
`ధృవ`తో రామ్‌ చరణ్‌ సెకండ్‌ లైఫ్‌

అయితే తమిళంలో ఇది హిట్‌ కావడంతో ఈ మూవీని తెలుగులో చరణ్‌తో రీమేక్‌ చేయాలనుకున్నారు చిరంజీవి. ఎందుకంటే రామ్‌ చరణ్‌ అప్పటి వరుస ఫ్లాప్‌ల్లో ఉన్నారు. `గోవిందుడు అందరివాడేలే`, `బ్రూస్లీ` చిత్రాలు ఆడలేదు. రెండూ దారుణంగా పరాజయం చెందాయి. ఓ రకంగా చరణ్‌ కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ అవుతున్నాడు. దీంతో `తనిఒరువన్‌`ని రీమేక్‌ చేయాలనుకున్నారు. అల్లు అరవింద్‌, సురేందర్‌ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. చరణ్‌తో సినిమా చేశారు. ఇందులో రకుల్ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. నెగటివ్‌ రోల్‌లో అరవింద స్వామినే నటించారు. తెలుగులోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రామ్‌ చరణ్‌కి సెకండ్‌ లైఫ్‌ ఇచ్చిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆయన కెరీర్‌ బిగ్‌ టర్న్ తీసుకుంది. అలా ప్రభాస్‌ వదులుకున్న మూవీతో చరణ్‌ బ్లాక్‌ బస్టర్ అందుకున్నారని చెప్పొచ్చు.

55
`పెద్ది`తో రాబోతున్న రామ్‌ చరణ్‌

ఆ తర్వాత సుకుమార్‌తో `రంగస్థలం` మూవీ చేశారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ 2018లో విడుదలైంది. నాన్‌ బాహుబలి రికార్డులను లేపేసింది. అనంతరం `వినయ విధేయ రామ`తో డిజాస్టర్ పడింది. కానీ రాజమౌళి తో చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` ఆయన్ని పాన్‌ ఇండియా స్టార్‌ ని చేసింది. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` చిత్రంలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఇది మార్చి 27న విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories