వార్ 2 ఫ్లాప్ తర్వాత నాగవంశీ ఫస్ట్ రియాక్షన్, ట్రోలర్స్ పై సెటైర్లు.. వైఆర్ఎఫ్ నుంచి నష్టపరిహారం నిజమేనా

Published : Aug 20, 2025, 06:43 PM IST

వార్ 2 మూవీ రిలీజ్ అయిన తర్వాత నిర్మాత నాగవంశీ తొలిసారి స్పందించారు. తనపై వస్తున్న ట్రోలింగ్ పై నాగవంశీ సమాధానం ఇచ్చారు. 

PREV
15
వరుస చిత్రాలతో నిర్మాత నాగవంశీ 

నాగవంశీ.. ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా దూసుకుపోతున్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ స్క్వేర్, డాకు మహారాజ్, భీమ్లా నాయక్, లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలని నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించారు. కానీ గత రెండు చిత్రాలతో నాగవంశీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. 

DID YOU KNOW ?
వార్ 2 మూవీ 6 డేస్ కలెక్షన్స్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల్లో 41 కోట్ల షేర్ సాధించింది.
25
భారీ బడ్జెట్ లో కింగ్డమ్ 

నాగవంశీ చివరగా కింగ్డమ్ అనే చిత్రాన్ని విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించారు. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం జూలై 31న విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. కానీ ఆ తర్వాత కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఈ మూవీ దాదాపు 80 నుంచి 100 కోట్ల బడ్జెట్ లో నిర్మించబడింది అని టాక్. దీనితో కింగ్డమ్ మూవీ వల్ల నాగవంశీ నష్టాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ నాగవంశీకి అసలైన ఎదురుదెబ్బ ఎన్టీఆర్ వార్ 2 చిత్రంతో తగిలింది. 

35
వార్ 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ 

వార్ 2 చిత్రానికి నాగవంశీ నిర్మాత కాదు. ఆయన ఈ చిత్రాన్ని వైఆర్ఎఫ్ సంస్థ నుంచి రూ.80 కోట్లకు కొని తెలుగులో రిలీజ్ చేశారు. తొలి రోజు నుంచి వార్ 2 మూవీకి నెగిటివ్ టాక్ మొదలైంది. క్రమంగా నెగిటివ్ టాక్ పెరుగుతూ వార్ 2 మూవీ ట్రోలింగ్ కి గురైంది. దీనితో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కుప్పకూలిపోయింది. ఫలితంగా నాగవంశీ భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు అని వార్తలు వస్తున్నాయి. 

45
తొలిసారి స్పందించిన నాగవంశీ 

వార్ 2 రిలీజ్ అయ్యాక నాగవంశీ కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. మీడియాకి గాని, సోషల్ మీడియాలో గాని ఆయన అందుబాటులో లేరు. దీనితో నాగవంశీ గురించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీపై ట్రోలింగ్ కూడా జరిగింది. మూవీ రిలీజైన దాదాపు వారం తర్వాత నాగవంశీ ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. తన గురించి వస్తున్న రూమర్స్ పై సెటైరికల్ గా స్పందించాడు. 

55
ట్రోలర్స్ కి షాకిచ్చిన నాగవంశీ 

'ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది వంశీ ఇది అని గ్రిప్పింగ్ నెరేటివ్స్ తో ఫుల్ హడావిడి నడుస్తోంది.. పర్లేదు, ట్విట్టర్ లో మంచి రచయితలు ఉన్నారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నందుకు సారీ, ఇంకా ఆ టైం రాలేదు. మినిమమ్ ఇంకో పది పదిహేనేళ్ళు ఇండస్ట్రీలోనే ఉంటా. సినిమాతోనే ఉంటా సినిమా కోసమే ఉంటా. త్వరలో మాస్ జాతరతో కలుద్దాం' అంటూ నాగవంశీ సెటైరికల్ ట్వీట్ చేశారు. ట్రోలర్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక్క ట్వీట్ తో సమాధానం ఇచ్చారు.  ఇదిలా ఉండగా మీడియాలో మరో ప్రచారం కూడా సాగుతోంది. వార్ 2 నష్టాలని భర్తీ చేసేందుకు వైఆర్ఎఫ్ సంస్థ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. నష్టపరిహారంగా వైఆర్ఎఫ్ సంస్థ నాగవంశీకి 22 కోట్లు వెనక్కి ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories