స్టార్ హీరోని ముద్దుగా జాగ్స్ అని పిలిచే నటి, సౌందర్య తర్వాత ఆమెతో ఎఫైర్ ? వాళ్లిద్దరూ ఎవరో తెలుసా

Published : Oct 05, 2025, 11:24 AM IST

ప్రియమణి ఓ స్టార్ హీరోతో లవ్ ఎఫైర్ రూమర్స్ పై స్పందించింది. వీరిద్దరూ నాలుగు చిత్రాల్లో నటించారు. ఆ హీరోకి ప్రియమణి ముద్దుపేరు కూడా పెట్టింది. ఇంతకీ అతడెవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
అది సౌందర్యకి మాత్రమే సాధ్యం 

అభినవ సావిత్రిగా పేరుగాంచిన దివంగత నటి సౌందర్యకి కూడా లవ్ ఎఫైర్ రూమర్స్ తప్పలేదు. దశాబ్దం పాటు సౌందర్య దక్షణాది చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా వెలుగు వెలిగింది. గ్లామర్ షోకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అంత కాలం స్టార్ గా వెలుగొందడం సౌందర్యకి మాత్రమే సాధ్యం అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ సౌందర్యని విపరీతంగా అభిమానించేవారు. సౌందర్య తన కెరీర్ లో సూపర్ రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలందరితో నటించింది. 

25
సౌందర్యతో స్నేహ బంధం మాత్రమే 

జగపతి బాబు, సౌందర్య మధ్య అప్పట్లో లవ్ ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. అయితే జగపతి బాబు ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సౌందర్యతో తనకున్నది మంచి స్నేహ బంధం మాత్రమే అని అన్నారు. అప్పట్లో జగపతి బాబు సౌందర్యని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి వెళ్లారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ ట్రైన్ లో సౌందర్యతో పాటు చిత్ర యూనిట్ కూడా ఉన్నారు. కానీ తాను సౌందర్య కోసమే వెళ్లినట్లు రూమర్స్ సృష్టించారు అని జగపతి బాబు తెలిపారు. 

35
కొన్ని రూమర్స్ నిజమే, జగపతి బాబు షాకింగ్ కామెంట్స్ 

జగపతి బాబుకి విమలారామన్, కళ్యాణి లాంటి నటీమణులతో కూడా లింక్ అప్ రూమర్స్ వచ్చాయి. తనపై వచ్చిన రూమర్స్ లో కొన్ని నిజాలు ఉన్నాయి అని జగపతి బాబు ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు. కానీ దానిని మరీ అతిగా చూపించి రూమర్స్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. రూమర్ క్రియేట్ చేసేది పనీపాటా లేని వాళ్ళు మాత్రమే. జగపతి బాబు క్లారిటీ ఇస్తూ.. 'మా తల్లి నుంచి నేను ప్రతి మహిళని ప్రేమిస్తాను, గౌరవిస్తాను. నాకు ఎవరైనా హీరోయిన్ నచ్చితే నచ్చావు అని ఓపెన్ గా చెబుతా. దాక్కుని మాట్లాడడం చేయను. నా గురించి మాట్లాడేవారికి నేనే అవకాశం ఇస్తున్నా. అలాంటప్పుడు ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడండి. 

45
ప్రియమణి, జగపతి బాబు కాంబినేషన్ 

లేని విషయాలని కూడా కల్పించి జగపతిబాబు ఇలా చేశాడు, మేము చూశాం అంటూ అతిగా బిల్డప్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలా చేయొద్దని జగపతి బాబు సూచించారు. ఉన్న విషయం మాట్లాడుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు' అని జగపతి బాబు అన్నారు. సౌందర్య, విమలా రామన్, కళ్యాణి లతో పాటు ప్రియమణితో కూడా జగపతి బాబుపై రూమర్స్ వచ్చాయి. ఈ రూమర్స్ పై ప్రియమణి ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయింది. ప్రియమణి జగపతి బాబుతో కలిసి నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రంతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. 

55
జగపతి బాబు నా రౌడీ 

ప్రియమణి ముద్దుగా జగపతి బాబుని 'జాగ్స్' అని పిలుస్తారు. ఆమె మాట్లాడుతూ.. జగపతి బాబు నా రౌడీ. మేమిద్దరం 4 చిత్రాల్లో కలిసి నటించాం. జాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా హృదయంలో జగపతి బాబుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. మా ఇద్దరి గురించి కూడా రూమర్స్ వచ్చాయి. పెళ్ళైన కొత్తలో చిత్రంలో మా జోడీ ఆడియన్స్ కి బాగా నచ్చింది. ఆ తర్వాత ప్రవరాఖ్యుడు, క్షేత్రం, సాధ్యం చిత్రాల్లో కలిసి నటించాం. రూమర్స్ అనేవి ఇప్పుడు ఏమి లేకపోయినా వచ్చేస్తున్నాయి. అలాంటిది మేమిద్దరం 4 చిత్రాల్లో కలిసి నటించాం. కాబట్టి రూమర్స్ సహజమే. మా మధ్య లవ్ హేట్ రిలేషన్ ఉంటుంది. ఎదురు పడితే ఏయ్ నువ్వు ఏంటి ఇక్కడ అని క్లోజ్ గా మాట్లాడుకుంటాం' అని ప్రియమణి తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories