మంచు వారి వారసుడు, మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు విష్ణు, 2009లో విరానికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు మొదటి సంతానంగా 2011 లో ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఆడ పిల్లలు అయిన వీరికి ఆరియానా, వీవియానా అనే పేర్లు పెట్టారు. ఆ తరువాత విష్ణు భార్య ఓ అబ్బాయి మరో అమ్మాయికి కూడా జన్మనిచ్చారు. ఆరియానా, వీవియానా లతో పాటు విష్ఞు చిన్న తనయుడు కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన కన్నప్ప సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.