Rashmika Vijay: సమంత- చైతన్య జాతకంలో దోషాల కారణంగా విడిపోయారని చాలా మంది జోతిష్య నిపుణులు కూడా చెప్పారు. మరి.. రష్మిక,విజయ్ జాతకంలో కూడా ఏమైనా దోషాలు ఉన్నాయా? వారిలాగా వీరు కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయా?
సినిమా తారలు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు అంటే... సహజంగానే అందరికీ ఒక ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటున్నారంటే ఈ ఇంట్రస్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవర కొండ, మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి.
24
సమంత-నాగ చైతన్యతో పోలికలు..
వీరి ఎంగేజ్మెంట్ అయినట్లు.. రష్మిక కానీ, విజయ్ కానీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ... అది నిజమేనని, మూడు నెలలో వారి పెళ్లి కూడా జరగనుందని కొన్ని సోర్స్ ధ్రువీకరించాయి. ఈ జంట గతంలో హీరో, హీరోయిన్లుగా రెండు సినిమాలు చేశారు. మొదటి సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారని.. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే... వీరు పెళ్లి చేసుకుంటున్నారు అనగానే..గతంలో వీరిలానే ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన సమంత-నాగ చైతన్య టాపిక్ వస్తోంది. సమంత- చైతన్య జాతకంలో దోషాల కారణంగా విడిపోయారని చాలా మంది జోతిష్య నిపుణులు కూడా చెప్పారు. మరి.. రష్మిక,విజయ్ జాతకంలో కూడా ఏమైనా దోషాలు ఉన్నాయా? వారిలాగా వీరు కూడా విడిపోయే అవకాశాలు ఉన్నాయా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం...
34
సమంత-నాగ చైతన్య జాతకంలో సమస్యలు...
జోతిష్యుల ప్రకారం, నాగ చైతన్య జాతకంలో చంద్రుడు బలహీన స్థితిలో ఉండటం, కుటుంబ అనుబంధం విషయంలో స్థిరత్వం తగ్గించింది. ఇక, సమంత జాతకంలో కుజ దోషం బలంగా ఉండటంతో దాంపత్య జీవితంలో సమస్యలు వచ్చాయి. ఇక, వీరిద్దరి మధ్య కంపాటబులిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
విజయ్ దేవరకొండ జాకతంలో శుక్రుడు నీచంగా ఉండటంతో వైవాహిక దోషాలు ఉన్నాయి అనేది నిజం. కానీ, రష్మిక జాతకంలో రాజకీయ యోగం, రాజశ్యామల- తార పూజల శక్తి.. విజయ్ జాతకంలో ఉన్న దోషాలను సమతుల్యం చేస్తుంది. దీని వల్ల వారి జీవితం ఎక్కువ సమస్యలు వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంది. అంతేకాదు.. రష్మిక జాతకం చాలా గొప్పగా ఉండనుందట. పెళ్లి తర్వాత ఆమె రాజకీయాల్లో కి అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది అని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి... ఈ జంట మధ్యలో విడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు.