ప్రదీప్‌ను వద్దన్న హీరోయిన్లు.
ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ప్రదీప్‌కు జోడీగా ఇవానా నటించారు. సత్యరాజ్, రాధిక, యోగి బాబు, రవీనా రవి వంటి వారు నటించారు. ప్రస్తుతం అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ నటిస్తున్న 'డ్రాగన్' సినిమా 21న విడుదల కానుంది.
ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్రదీప్ మాట్లాడుతూ.. నా పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఆలోచించారు. నీతో నటించం అని చెప్పకనేచెప్పారు. లవ్ టుడే సినిమా కోసం చాలా మంది హీరోయిన్లను సంప్రదించాను. కానీ ఎవరూ ఒప్పుకోలేదు. నన్ను తిరస్కరించారు" అని బాధను వెల్లడించారు ప్రదీప్. ఇక ఇప్పుడు డ్రాగన్ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌తో కలిసి నటిస్తున్నానని గర్వంగా చెప్పారుప్రదీప్.
Also Read: రష్మిక మందన్న కి ముద్దు పేరు పెట్టిన విజయ్ దేవరకొండ, రౌడీ హీరో ఏమని పిలుస్తాడంటే