హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించిన తాజా చిత్రం బ్రహ్మ ఆనందం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కథ బావుంది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటించిన తాజా చిత్రం బ్రహ్మ ఆనందం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కథ బావుంది అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఆడియన్స్ నుంచి చూడదగ్గ చిత్రం అంటూ రెస్పాన్స్ వస్తోంది.
24
ఈ చిత్రంలో బ్రహ్మానందం తన కొడుకు రాజా గౌతమ్ తో కలసి నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. రాజా గౌతమ్ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని వస్తున్న రెస్పాన్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
34
brahma anandam movie
అభిమానులు ఎక్కువగా బ్రహ్మానందం, రాజా గౌతమ్ భావోద్వేగంతో కౌగిలించుకునే ఎమోషనల్ సీన్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీనిపై రాజా గౌతమ్ ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యారు. ఇది జీవితంలో మరచిపోలేని అనుభూతి అని కామెంట్ పెట్టాడు.
44
Brahmanandam
రాజా గౌతమ్ 2004లో పల్లకిలో పెళ్లికూతురు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే రాజా గౌతమ్ హీరోగా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. మను, బసంతి, బ్రేక్ అవుట్ లాంటి చిత్రాల్లో నటించారు.