The Raja Saab: భారీ రేట్‌కి రాజా సాబ్‌ ఓటీటీ డీల్‌, నిర్మాత బతికిపోయాడు.. ప్రభాస్‌ మూవీ టోటల్ లాస్‌ ఎంతంటే

Published : Jan 27, 2026, 09:49 AM IST

ప్రభాస్‌ హీరోగా వచ్చిన `ది రాజా సాబ్` మూవీ ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యింది. భారీ రేటుకి అమ్ముడు పోయింది. అయితే ఈ సినిమా నష్టం మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో అతిపెద్ద లాస్‌ అని చెప్పొచ్చు. 

PREV
15
ది రాజా సాబ్‌తో సందడి చేసిన ప్రభాస్‌

ప్రభాస్‌ ఈ సంక్రాంతికి `ది రాజా సాబ్` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. డార్లింగ్‌ ఏరికోరి చేసిన చిత్రమిది. వరుసగా యాక్షన్‌ సినిమాలు అవుతున్న నేపథ్యంలో వాటి నుంచి రిలీఫ్‌ కోసం, వింటేజ్‌ ప్రభాస్‌ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ మూవీ చేశారు. హర్రర్‌ కామెడీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించారు దర్శకుడు మారుతి. ముగ్గురు హీరోయిన్లతో మంచి గ్లామర్‌ పాళ్లు దట్టించారు. కానీ కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. హర్రర్‌ ఎలిమెంట్లు కూడా తేలిపోయాయి. సైకలాజికల్‌ అంశాలు పెద్దగా కనెక్ట్ కాలేదు. దీనికితోడు ఇందులో దెయ్యాన్ని చూసి ప్రభాస్‌ భయపడటం ఆడియెన్స్ రిసీవ్‌ చేసుకోలేదు. దీంతో మూవీ పరాజయం చెందింది.

25
సంక్రాంతి చివర్లో వస్తే ఫలితం వేరేలా ఉండేది

`ది రాజా సాబ్‌` మూవీ సంక్రాంతి పండుగని పురస్కరించుకుని జనవరి 9న విడుదలైంది. మొదట విడుదలైన చిత్రమిదే కావడం గమనార్హం. పైగా అర్థరాత్రి ప్రీమియర్స్ వేయడంతో మూవీకి నెగటివ్ టాక్‌ వచ్చింది. దారుణమైన ట్రోలింగ్‌ నడిచింది. అయితే ఆ తర్వాత   ఎడిటింగ్‌ చేశారు. ఆ తర్వాత కాస్త ఫర్వాలేదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అదే మూవీని దెబ్బ కొట్టింది. దీనికితోడు ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్యామిలీ మూవీస్‌ కావడంతో జనం వాటికి బ్రహ్మరథం పట్టారు. ఇదే సినిమా సంక్రాంతి పండక్కి చివర్లో  వస్తే ఫలితం వేరేలా ఉండేదని చెప్పొచ్చు.

35
ది రాజా సాబ్ కలెక్షన్లు, ఎంత నష్టం అంటే

ఇక జనవరి 9న విడుదలైన ఈ మూవీ ఆల్మోస్ట్ థియేటర్ల నుంచి క్లోజ్‌ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ మూవీ థియేటర్లని ఇతర చిత్రాలకు కేటాయించారు. థియేటర్‌ క్లోజ్‌ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.206కోట్లు వసూలు చేసింది. అంటే రూ.120కోట్ల షేర్‌ సాధించింది. ఈ మూవీకి రూ.209కోట్ల థియేట్రికల్‌ బిజినెస్ గా లెక్కకట్టారు. చాలా వరకు సోలో రిలీజ్‌. ఆ బిజినెస్‌ పరంగా చూస్తే ఈ మూవీకి ఇంకా రూ.90కోట్ల వరకు షేర్‌ రావాలి. థియేట్రికల్‌గా ఈ మూవీకి తొంబై కోట్ల నష్టమని చెప్పొచ్చు.

45
నిర్మాత విశ్వప్రసాద్‌ కి ది రాజా సాబ్‌ ద్వారా వచ్చిన నష్టం

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ డీల్‌ సెట్‌ అయ్యింది. రిలీజ్‌కి ముందు ఓటీటీ రైట్స్ అమ్ముడు పోలేదని సమాచారం. జియో హాట్‌ స్టార్‌ ఈ మూవీ హక్కులను కొనుగోలు చేసింది. సుమారు రూ.80కోట్లకి డీల్‌ సెట్‌ అయ్యింది. ఇది అన్ని భాషల్లో కావడం విశేషం. ప్రభాస్‌ రేంజ్‌ మూవీకిది తక్కువే అయినా, సినిమా డిజాస్టర్‌ కారణంగా ఈ స్థాయిలో వచ్చినా అది బెటర్‌ అనే చెప్పొచ్చు. దీంతో నిర్మాత కొంత వరకు రిలీఫ్‌ అయ్యారని చెప్పొచ్చు. కానీ ఈ సినిమాకి బడ్జెట్‌ రూ.400కోట్లు అని సమాచారం. ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్ ద్వారా నిర్మాతకు వచ్చిన నష్టం ఏకంగా రూ.150కోట్లకుపైగానే ఉంటుందని టాక్‌. ఇటీవల కాలంలో ఇది అతిపెద్ద లాస్‌. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ వివరాలు కేవలం సోషల్‌ మీడియాలో సర్కిలేట్ అయ్యే లెక్కల సమాచారం మాత్రమే.

55
ది రాజా సాబ్‌ టీమ్‌ ఇదే

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన `ది రాజా సాబ్‌`లో ప్రభాస్‌ కి జోడీగా మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషించారు. ఆయనతోపాటు జరీనా వాహబ్‌, ప్రభాస్‌ శ్రీను, సప్తగిరి, వీటీవీ గణేష్‌ వంటి వారు ఇతర పాత్రల్లో మెరిశారు. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మించిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories