Illu Illalu Pillalu Today Episode Jan 27: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో తెల్లారితే అమూల్య సంగీత్ ఎంతో ఆనందంగా సాగుతుంది. మధ్యలో విశ్వక్ అమూల్యకు మాయమాటలు ఇంట్లోంచి బయటికి వచ్చేలా చేస్తాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి.
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్య సంగీత్ ఫంక్షన్ మొదలవుతుంది. సాగర్ నర్మద జంట మొదట డాన్సు వేస్తారు. మరో పక్క వల్లి, భాగ్యం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. రామరాజు భాగ్యంతో ఇడ్లీ బాబాయ్ కనిపించట్లేదని అడుగుతాడు. దానికి భాగ్యం ఏదేదో చెప్పి తప్పించుకుంటుంది. తర్వాత వల్లి, చందు జంట కూడా డాన్స్ వేస్తారు. ఆ తర్వాత ధీరజ్ ప్రేమ కలిసి డ్యాన్సులు వేస్తారు. రామరాజు వేదవతి కూడా కాసేపు డాన్స్ వేస్తారు. వీరు డ్యాన్సులు వేస్తూ ఉంటే సేనాపతి, భద్రావతి తమ ఇంటి మీద నుంచి చూస్తూ ఉంటారు. సిగ్గు లేకుండా ఎలా ఎగురుతున్నాడో చూడు అంటూ రామరాజును అంటాడు సేనాపతి. దానికి భద్రావతి ఎగరనీ ఎంత ఎగిరినా.. ఈ రాత్రే. రేపు ఉదయం వాడే ఎగిరిపోతాడు అని అంటుంది. సేనాపతి వాడిని అంత ఆనందంగా చూడడం నావల్ల కావట్లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు.
23
విశ్వక్ అమూల్యకు ఫోన్
ఈలోపు విశ్వ.. వల్లికి ఫోన్ చేస్తాడు. కానీ వల్లి ఫోను లిఫ్ట్ చేయదు. అమూల్యను చెయ్యి పట్టుకొని వల్లీ గదిలోకి తీసుకొస్తుంది. విశ్వక్ ఫోన్లో లైన్ లో ఉన్నాడు మాట్లాడు అని ఇస్తుంది. దానికి అమూల్య తను మాట్లాడనని చెప్పేస్తుంది. ఇలా ఇబ్బంది పెడితే అన్నయ్యలకు చెప్పేస్తానని అంటుంది. దాంతో వల్లి కాసేపు అమూల్యకు నచ్చజెబుతుంది. చివరిసారిగా మాట్లాడమని చెబుతుంది వల్లి. ఇదంతా నీ మంచికే అని చెబుతున్నా అని అనగానే అమూల్య ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. ‘నా కారణంగా మా వాళ్లు బాధపడే పరిస్థితి రాకూడదని వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటున్నానని నీకు చెప్పాను. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నావ్. ఇలా పదే పదే ఫోన్ చేసి బాధ పెట్టడం అనక ఏమంటారు?’ అని అంటుంది.
విశ్వ మాట్లాడుతూ ‘చివరిసారిగా నిన్ను చూడాలనిపిస్తుంది. ఒక్కసారి నిన్ను చూడాలనుకుంటున్నాను. నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ లన్ని తిరిగి ఇచ్చేస్తాను. ఒక్కసారి బయటికి రా అమూల్య’ అని బతిమిలాడతాడు. విశ్వక్ ఎంత బతిమిలాడినా రానని చెబుతుంది అమూల్య. నువ్వు దూరమయ్యే బాధను నేను జీవితాంతం భరించాలి.. చివరిసారిగా ఒక్కసారి కనిపించవచ్చు కదా అని బతిమిలాడుతాడు. చివరికి అమూల్య కాస్త మెత్తబడి చివరిగా బయటికి వచ్చి కలిసేందుకు ఒప్పుకుంటుంది.
33
బయటికి వెళ్లేందుకు ప్లాన్
వేదవతి అమూల్య దగ్గరికి అన్నం పట్టుకుని వస్తుంది. అన్నం తినిపిస్తానని వేదవతి అంటే అమూల్య తింటానని చెబుతుంది. అయినా వేదవతి తన చేత్తోనే అన్నం తినిపిస్తుంది. రేపు ఉదయాన్నే పెళ్లి మండపానికి వెళ్లాలి, కాబట్టి త్వరగా తిని త్వరగా పడుకోమని చెబుతుంది. బయట విశ్వక్.. అమూల్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అర్ధరాత్రి అందరు పడుకున్నాక భాగ్యం నిద్రలేచి వల్లిని కూడా నిద్ర లేపుతుంది. భాగ్యం మాట్లాడుతూ అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పచెప్పితే మీ నాన్నను వదిలేస్తాడు అని ఐడియా ఇస్తుంది. అమూల్యను బయటికి ఎలా తీసుకెళ్లాలని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే భాగ్యానికి మెరుపులాంటి ఐడియా వస్తుంది. అది ఇద్దరూ కలిసి అమలు చేస్తారు.
భాగ్యం, వల్లి కలిసి ఇంటి కరెంటును ఆపేస్తారు. ఇద్దరూ కలిసి అమూల్య గదివైపు వెళ్తుంటే తిరుపతి నిద్రలేస్తాడు. దీంతో ఇద్దరు ఒక మూల దాక్కొంటారు. కాసేపు ఈ సీన్ ఫన్నీగా సాగుతుంది. తిరుపతి కాసేపటి తర్వాత వెళ్లి నిద్రపోతాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.