14 ఏళ్ళ తర్వాత భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చిరంజీవి, మరి పవన్ కళ్యాణ్ ?..ఆ దర్శకుడు ఏం చేశారంటే

Published : Jan 27, 2026, 08:30 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అయితే చిరంజీవికి తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు 14 ఏళ్ళ సమయం పట్టిందట. 

PREV
15
ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉన్నాయి. గొప్ప విజయాలు కూడా ఉన్నాయి. చిరంజీవి సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తన సతీమణి సురేఖకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. చిరంజీవి రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనని వివి వినాయక్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

25
సురేఖకి మాట ఇచ్చిన చిరంజీవి

ఠాగూర్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు చిరంజీవి.. వివి వినాయక్ తో ఇలా అన్నారట. మీ వదిన సురేఖ చాలా కాలంగా తన నిర్మాణంలో ఒక సినిమా చేయమని అడుగుతోంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ని కూడా అడుగుతోంది. మేమిద్దరం కలిసి నటించే కథ దొరకడం కష్టం. కాబట్టి విడివిడిగా అయినా ఆ సినిమాలు నువ్వే చేయాలి అని చిరంజీవి అన్నారు.

35
చిరంజీవి సినిమాకి సమర్పకురాలిగా సురేఖ

తధాస్తు దేవతలు తధాస్తు అన్నట్లు అప్పుడు చిరంజీవి గారు చెప్పిన మాట ఖైదీ నెంబర్ 150తో నెరవేరింది. ఆ చిత్రానికి సురేఖ గారే నిర్మాత. ఈ చిత్రానికి ఆమె సమర్పకురాలిగా ఉన్నారు. చిరంజీవి గారు రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు చాలా మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఆ అవకాశం నాకే దక్కింది. చిరంజీవి గారు ఒకరోజు నన్ను పిలిచి వినాయక్.. కత్తి సినిమా చూశావా అని అడిగారు. లేదు అన్నయ్య అని చెప్పా. ఒకసారి నన్ను ఆ మూవీలో ఊహించుకుని సినిమా చూడు ఆ తర్వాత నీ అభిప్రాయం చెప్పు అని అన్నారు.

45
ఇంట్రెస్ట్ లేదని చెప్పిన వినాయక్

ఆ టైంలో నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకుండా చూస్తే రాంగ్ డెసిషన్స్ వస్తాయి అని.. 10 రోజుల తర్వాత చూస్తాను అని చిరంజీవి గారికి చెప్పా. ఆయన నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడే చూడు అన్నారు. ఒకరోజు కత్తి మూవీ పెట్టుకుని చూడడం ప్రారంభించాను. చిరంజీవి గారికి ఈ మూవీ అదిరిపోతుంది. షూర్ షాట్ హిట్ అంతే. కాకపోతే కామెడీ, పాటలు తక్కువ అయ్యాయి. వాటిపై వర్క్ చేయాలి అని చిరంజీవి గారికి చెప్పా. ఆయన ఒకే అన్నారు. అంతా రెడీ చేసి స్క్రిప్ట్ చెబితే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఒకే అయింది. ముందుగా అనుష్క, కాజల్ ఇద్దరు హీరోయిన్లు ఉండాలని అనుకున్నాం. చివరికి కాజల్ ఒక్కరే ఉంటే సరిపోతుంది అనిపించింది.

55
మరి పవన్ కళ్యాణ్ సంగతేంటి ?

స్క్రిప్ట్ అంతా ఒకే అయ్యాక ఇందులో బ్రహ్మానందం కి ఏమైనా ఛాన్స్ ఉందా అని చిరంజీవి గారు అడిగారు. దీనితో ఒక ఎపిసోడ్ లేపేసి బ్రహ్మానందం క్యారెక్టర్ సెట్ చేశాం అని వినాయక్ తెలిపారు. ఖైదీ నెంబర్ 150 చిత్రం విడుదలై రికార్డులు తిరగరాసింది. ఆ విధంగా చిరంజీవి 14 ఏళ్ళ తర్వాత తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తన వదిన కోసం ఇంకా మూవీ చేయలేదు.

Read more Photos on
click me!

Recommended Stories