టాక్ షోలో ప్రభాస్, ఎప్పుడు, ఎక్కడ, పూర్తి డిటేల్స్

First Published | Oct 22, 2024, 12:51 PM IST

ప్రభాస్ 'నా ఉచ్ఛ్వాసం కవనం' అనే టాక్ షోలో పాల్గొని, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ షో ఈటీవీలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రసారం అవుతుంది.

Prabhas, Hanu Raghavapudi, KALKI

తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన ప్రభాస్ స్టేజీపై  పాల్గొని మాట్లాడటం చాలా తక్కువ. అలానే ఇంటర్వ్యూలు, టాక్ షోలని పెద్దగా ఇష్టపడరు, మాగ్జిమం వాటికి  దూరంగానే ఉంటారు. అలాంటి ప్రభాస్ తాజాగా  ఓ టాక్ షోకు హాజరయ్యారు. ఆ షోలో  ప్రభాస్ మాట్లాడారు. ఆ ఎపిసోడ్ కు చెందిన వివరాలు ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ పుట్టిన రోజు సంబరాలు మొదలైన ఈ సమయంలో ఫ్యాన్స్ ఈ విశేషాలను  వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఏ షోలో ప్రభాస్  పాల్గొన్నారు. ఏమి మాట్లాడారో చూద్దాం.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Prabhas, Hanu Raghavapudi, KALKI


ప్రభాస్ ...‘నా ఉచ్ఛ్వాసం కవనం’ అనే పోగ్రామ్ కు హజరై సందడి చేశారు. లెజండరీ సినీ గేయ రచయితతో తమకు ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ సినీ తారలు పంచుకుంటున్న జ్ఞాపకాల వేదికగా  ‘నా ఉచ్ఛ్వాసం కవనం’ కార్యక్రమాన్ని ఈటీవీ ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రసారం చేస్తోంది. ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ లోనూ స్ట్రీమింగ్ కానుంది. 


Prabhas aunt about actors wedding plan


తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. సోమవారం ఆయన జయంతిని పురస్కరించుకొని సిరివెన్నెల సాహిత్యాన్ని భావితరాలకు అందించే కృషిలో భాగంగా.. ‘నా ఉచ్ఛ్వాసం కవనం..!’ అనే సంగీత వ్యాఖ్యాన కార్యక్రమం  ఈటీవీలో ప్రసారం చేస్తున్నారు. 


ఈటీవీ సౌజన్యంతో ‘శ్రుతి లయ ఫౌండేషన్‌ అమెరికా’, ‘కీర్తన అకాడెమీ ఆఫ్‌ మ్యూజిక్‌’ సంయుక్త సమర్పణలో రామ్‌ చెరువు నిర్మాణ సారథ్యంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పార్థు నేమాని వ్యాఖ్యాతగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం భారతదేశంలోనూ, అదే సమయంలో అమెరికాలోనూ 52 ఆదివారాల పాటు ఈటీవీలో ప్రసారమవుతుంది. 

Prabhas


ఇందులో నాగార్జున, ప్రభాస్, తనికెళ్ల భరణి, మణిరత్నం, రాజమౌళి, కృష్ణ వంశీ, క్రిష్‌ జాగర్లమూడి, రామజోగయ్య శాస్త్రి, ఆర్పీ పట్నాయక్‌ లాంటి సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా ప్రభాస్ కూడా వచ్చారు.  

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభాస్ .. సిరివెన్నెల సీతారామ శాస్త్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన ప్రతిభను కొనియాడారు. మొదటిసారి ఆయనతో పరిచయం అయిన సందర్భంలో 'మెల్లగా .. గరగనీ ..' అంటూ మెలోడో సాంగ్ పాడుతుంటే నా  గుండె ఒక్క సారిగా ఆగిపోయినంత పని అయిందన్నారు. రొమాన్స్‌ కూడా ఆయన ఎంతో బ్యూటీ ఫుల్‌గా రాసేవారని అన్నారు. సాహిత్యం అందం..అర్ధంతో పాటు, రాసేవాళ్లకు ఉన్న విలువ ఏంటో తెలియజెప్పిన వ్యక్తి సిరివెన్నెల అని ప్రభాస్ కొనియాడారు.  

Prabhas


రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే... ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న క్రేజీ మూవీ “రాజా సాబ్” నుంచి రెబల్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. “రాజా సాబ్” సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో “రాజా సాబ్” సినిమాను దర్శకుడు మారుతి రూపొందిస్తుండటంతో ఈ సినిమా మీద అందరిలో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. “రాజా సాబ్” పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం “రాజా సాబ్” చిత్రీకరణ తుది దశలో ఉంది.

read more: షాకింగ్ రేటుకు ప్రభాస్ 'రాజా సాబ్' ఆడియో రైట్స్

Also Read : భర్తతో విడాకులపై రంభ కౌంటర్‌.. గొడవంతా ఆ విషయంలోనే, తెరవెనుక ఇంత జరిగిందా?

Latest Videos

click me!