రంభ ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా టాలీవుడ్‌ని ఊపేస్తుంది. తెలుగులోనే కాదు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. గ్లామర్ పాత్రలతోపాటు ఐటెమ్ సాంగ్స్ కూడా చేసి ఆద్యంతం కనువిందు చేసింది. కుర్రకారుకి డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. రంభ సినిమాలో ఉందంటే మాస్ ఆడియెన్స్ కి, కుర్రాళ్లకి పండగ అనే చెప్పాలి. అంతగా తన గ్లామర్ ట్రీట్ ఇచ్చి అభిమానులుగా చేసుకుంది రంభ.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇండస్ట్రీలో ఆమె ఉన్నది చాలా తక్కువ టైమే. కరెక్ట్ గా పదేళ్లు ఉంది. ఆ తర్వాత రెండు మూడేళ్లు అడపాదడపా సినిమాల్లో మెరిసింది. ఈ స్పాన్‌లోనే ఆమె వందకుపైగా సినిమాలు చేయడం విశేషం. అంటే ఏడాదికి పది సినిమాల లెక్కన ఆడియెన్స్ పై దండయాత్ర చేసింది. ఎక్కడ చూసినా ఈ అమ్మడు నటించిన సినిమాలే విడుదలయ్యేవంటే అతిశయోక్తి కాదు. కృష్ణ, చిరంజీవి నుంచి అప్పటి యంగ్ హీరోలు ఎన్టీఆర్‌తోనూ ఆడిపాడింది. ఓ దశాబ్దం పాటు ఓ ఊపు ఊపేసింది.
2010లో ఆమె మ్యారేజ్ చేసుకుంది. కెనడాలో సెటిల్ అయిన శ్రీలంక తమిళ్ బిజినెస్ మేన్ ఇంద్ర కుమార్ పథ్మనాభన్‌ని వివాహం చేసుకుంది. ఆమెకి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు జన్మించారు. దాదాపు 14ఏళ్లుగా హ్యాపీ లైఫ్ ని అనుభవిస్తుంది. అయితే రంభ తన భర్తతో విడిపోతున్నట్టు ఆ మధ్య రూమర్స్ వచ్చాయి. విడాకులు తీసుకుంటున్నట్టు రూమర్లు వచ్చిన నేపథ్యంలో దీనిపై రంభ స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
తాను విడాకులు తీసుకుంటున్నట్టు వచ్చిన రూమర్లపై ఆమె స్పందిస్తూ, ఈ వార్తలు ఎంతో బాధ కలిగించాయని తెలిపింది. దారుణంగా రాస్తున్నారని, తన గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఇలా రాస్తారా అని బాధేసిందని తెలిపింది. అయితే తమ మధ్య అలాంటిదేమీ లేదని, తాము అన్ని రకాలుగా హ్యాపీగానే ఉన్నామని తెలిపింది.
మ్యారేజ్ లైఫ్ హ్యాపీగానే సాగుతుందని చెప్పింది రంభ. అయితే ఈ సందర్భంగానే అసలు విషయం రివీల్ చేసింది. ఈ రూమర్స్ కి కారణమేంటో తెలిపింది. అందరు ఫ్యామిలీలో జరిగినట్టే తమ ఫ్యామిలీలోనూ గొడవలు జరుగుతాయని, అయితే అవి విడిపోయేంత పెద్దవి కావని చెప్పింది. వాటిని బూతద్దంలో పెట్టి చూడొద్దని పేర్కొంది.
తమ పిల్లలను ఇండియాలో పెంచాలని తాను అనుకుంటున్నానని, కానీ ఆయన నార్త్ అమెరికాలోనే పెంచుతా అని అంటున్నాడు. ఈ విషయంలో తమ మధ్య గొడవ వచ్చిందట. `నా ఉద్దేశ్యమేంటంటే నా పిల్లలు మన కల్చర్ తెలుసుకోవాలి, మన కల్చర్‌లో పెరగాలి, మన కట్టుబాట్లు, సాంప్రదాయాలను గౌరవించేలా పెంచాలని కోరుకుంటాను.
కానీ ఆయన వాళ్లు నా బిడ్డలే కదా, నాకు నచ్చినట్టుగానే పెరగాలి అని ఆయన కోరుకుంటారు. ఈ విషయంలోనే కొంత డిస్కషన్ జరుగుతుంటుంది. అంతే తప్ప అవి పెద్ద గొడవలు కావు` అని పేర్కొంది రంభ.
ఇదిలా ఉంటే వీరి విడాకులకు సంబంధించిన మరో రూమర్ కూడా ఉంది. ఈ ఇద్దరు ఫ్యామిలీ కోర్ట్ వరకు వెళ్లారని తెలిసింది. రంభ తాను ఇండియా వెళ్లిపోతానని చెప్పిందని, పిల్లల పోషణతో పాటు ఇతర ఖర్చులకు తనకు నెలకు ఐదు లక్షల రూపాయలు భరణంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ కోర్ట్ లో పిటీషన్ వేసిందని సమాచారం. ఈ విషయం తెలిసిందే.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ గొడవని సెటిల్ చేశారట. రంభకు రాఘవేంద్రుడు హితబోద చేసినట్టు తెలుస్తోంది. భర్తకు దూరమైతే సమాజంలో ఎలాంటిఇబ్బందుల వస్తాయి. అని చెప్పడంతో పిల్లల పోషణకు ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్పడంతో .. ఆమె మెత్తపడిందట. అంతే కాదు చిన్నచిన్న విభేదాలకు పంతాలకు పోకూడదని రాఘవేంద్రరావు చేసిన సూచనలతో రంభ తిరిగి భర్తతో కాపురం చేసేందుకు ఒప్పుకుందట.
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే రంభ మాత్రం దీన్ని చిన్నగొడవగానే చెప్పడం విశేషం. కొన్నాళ్ల క్రితం టీవీ9తో జరిపిన చిట్ చాట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది రంభ. ఈ పాత చిట్ చాట్ ఇప్పుడు వైరల్ అవుతుండటం గమనార్హం.
Read more: `ఈశ్వర్` సినిమాని మొదట ఏ హీరోతో చేయాలనుకున్నారో తెలుసా? ప్రభాస్ ని కూడా కాదని మరో హీరోకి