ఇక మెహబూబ్-నయని పావని మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ నడిచింది. ప్రేరణ పృథ్విని నామినేట్ చేసింది. విష్ణుప్రియను టేస్టీ తేజ నామినేట్ చేశాడు. మెహబూబ్, హరితేజ సైతం వాదులాడుకున్నారు. వాడి వేడి వాదనల నడుమ నామినేషన్స్ ప్రక్రియ ముగిసినట్లు సమాచారం. బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లిస్ట్ ప్రకటించారట. నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ, పృథ్విరాజ్, ప్రేరణ, నిఖిల్ నామినేట్ అయ్యారట.
అధికారిక ప్రకటనకు ముందే నామినేషన్స్ లిస్ట్ బయటకు వస్తుంది. పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నారు. మెజారిటీ పోల్ రిజల్ట్స్ పరిశీలిస్తే ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరేట్స్ గా ప్రచారం అవుతున్న నిఖిల్, విష్ణుప్రియలకు ప్రేరణ షాక్ ఇచ్చిందట.