ఈ బ్యానర్‌లో మొత్తం మూడు సినిమాలు చేయాల్సి ఉండగా, `సలార్ 2` అందులోనే తెరకెక్కబోతుంది. దీంతోపాటు `హనుమాన్` ఫేమ్ ప్రశాంత్ వర్మతో సినిమా హోంబలే ఫిల్మ్స్ నిర్మించబోతుందట. అలాగే లోకేష్ కనగరాజ్‌తో సినిమా కూడా హోంబలేలోనే ఉంటుందని సమాచారం.
ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రశాంత్ వర్మ, ప్రభాస్ ల సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టెస్ట్ షూట్ నేడు బుధవారం జరగబోతుందట. ప్రభాస్‌పై ప్రశాంత్ వర్మ టెస్ట్ షూట్ చేయబోతున్నారట.