ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు, కైకాల సత్యనారాయణ వంటి వారిని తొలితరం హీరోలుగా చెబుతుంటారు. అప్పట్లో వీరంతా తమనలో ఉన్న ఆర్ట్ ని, నటన అనే ఆసక్తిని వెల్లడించేందుకు,
తాము కళాకారులుగా రాణించేందుకు, తమ ప్రతిభని చాటి చెప్పేందుకు ప్రయత్నించారు. అందులో సక్సెస్ కావాలని తపించారు. అంతేకాదు ఆర్థికంగా సంపాదించాలని, కోటీశ్వరులు కావాలని సినిమాలు చేసేవారు కాదు. ఆర్టిస్ట్ లంతా ఉద్యోగులుగానే భావించేవారు.