ఆ హీరోయిన్‌ నడుముని చూస్తే ఏఎన్నార్‌ ఏజ్‌ 25 అయిపోతుందా? అక్కినేని చిలిపి పనులు బయటపెట్టిన సీనియర్‌ నటి

Published : Feb 26, 2025, 07:25 AM IST

ANR: అక్కినేని హీరోలంటేనే రొమాంటిక్‌ అనే కామెంట్‌ వినిపిస్తుంది. నాగార్జున అత్యంత రొమాంటిక్‌ అంటుంటారు. కానీ కొడుకుని మించిన మన్మథుడు అక్కినేని నాగేశ్వరరావు అట. ఆ కథేంటో చూద్దాం.   

PREV
15
ఆ హీరోయిన్‌ నడుముని చూస్తే ఏఎన్నార్‌ ఏజ్‌ 25 అయిపోతుందా? అక్కినేని చిలిపి పనులు బయటపెట్టిన సీనియర్‌ నటి
ANR

ANR: అక్కినేని నాగేశ్వరరావు లెజెండరీ నటుడు. అలుపెరగని నటనా బాటసారిగా రాణించారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి తరం హీరోల్లో ఎన్టీఆర్‌కి ధీటుగా రాణించిన నటుడు. ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణికాలు చేస్తే, ఏఎన్నార్‌ ప్రేమ కథలు, కుటుంబ కథలు, సాంఘీకాలు చేసి మెప్పించారు. 

25
ANR

ఏఎన్నార్‌ అప్పట్లో లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఇమేజ్‌ మాత్రమే కాదు, రియాలిటీ కూడా అదే. ఆయన ఎప్పుడూ రొమాంటిక్‌గా ఉండేవాడట. హీరోయిన్ల విషయంలో మాత్రం ఆయన ఏజ్‌ తగ్గిపోతుందని, కుర్రాడిలా ప్రవర్తిస్తాడని అంటుంటారు. సీనియర్‌ నటి ఒకరు కూడా ఇదే విషయం చెప్పారు. తన నడుముని పట్టుకుని కామెంట్లు చేసేవాడని తెలిపింది. 
 

35
Jayamalini

ఆ హీరోయిన్‌ నడుము చూస్తే ఏఎన్నార్‌ ఏజ్‌ 25 అయిపోతుందట. ఏజ్‌ మాత్రమే కాదు, మనసు కూడా అలానే ఉంటుందన్నారు. కుర్రాడిలా ప్రవర్తిస్తాడని తెలిపింది. ఆమె ఎవరో కాదు సీనియర్‌ నటి జయమాలిని. ఒకప్పుడు వ్యాంప్‌ పాత్రలతో మెప్పించారు ఆమె.

ముఖ్యంగా శృంగారభరిత పాటల్లో(ఐటెమ్ సాంగ్‌)ల్లో నర్తించి ఉర్రూతలూగించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాలం, హిందీ వంటి భాషల్లో 600లకుపైగా సినిమాలు చేశారు. వాటిలో పాటల్లోనే కాదు, నటిగానూ మెప్పించారు. హీరోయిన్‌గానూ నటించారు. 

45
anr

ఆ మధ్య తెలుగు వన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయమాలిని.. ఏఎన్నార్‌ చిలిపి వ్యవహారాలు బయటపెట్టింది. ఆయన తన నడుముని చూసి కామెంట్‌ చేసేవాడట. తాను ఆయనతో కలిసి చాలా సినిమాలు చేశాం.

తనని హీరోయిన్‌లా చూడరు, ఓ అత్తకూతురిలా చూస్తుంటారు. సరదాగా ఉంటారు. కామెంట్లు చేస్తుంటారు. ఆయనకు ఎప్పుడు 25 ఏజ్‌, ఆల్వేస్‌ అలానే ఉంటారు. నేను సైలెంట్‌గా ఉంటానని నాతో సరసం ఆడుతుంటాడు. 
 

55
Jayamalini

ఓ సినిమాలో నడుము పట్టుకుని ఆడాలి. ఆ సీన్‌ వచ్చినప్పుడు `అబ్బ నాకు హాయిగా ఉందబ్బ. ఈ నడుము పట్టుకుంటే స్టాండ్‌ వేయక్కర్లేదు, ఈజీగా ఉంది పట్టుకోవడానికి` అంటూ కామెంట్‌ చేసేవాడట.

హీరోయిన్లు కనిపిస్తే చాలు ఆయనలో చిలిపితనం బయటకు వస్తుందని, అందరిని ఏదో ఒకటి అంటుంటారని, జయమాలిని విషయంలో అది ఎక్కువగా ఉంటుందని, తనని చూడగానే కుర్రాడిలా మారిపోతాడని తెలిపింది జయమాలిని. ఆమె ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

read  more: Mazaka Review: `మజాకా` మూవీ రివ్యూ

also read: హీరోగా నువ్వు చేసినా ఓకె, అతడి పక్కన నటించనని డైరెక్టర్ కి చెప్పిన సౌందర్య.. కట్ చేస్తే మూవీ బ్లాక్ బస్టర్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories