సందీప్ కిషన్‌కు తల్లిగా ప్రభాస్ హీరోయిన్, షాకింగ్ న్యూస్ లో నిజమెంత..?

First Published | May 9, 2024, 4:25 PM IST

ఆమె ఒకప్పుడు ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు ఓ యంగ్ హీరోకు తల్లిగా నటించబోతోంది. ఇంతకీ ఎవరావిడి.. ? ఏంటా కథ. 
 

చాలామంది హీరోయిన్లు ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి.. ఇప్పుడు తల్లలుగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, రాధిక, ఆమని, నదియా లాంటివారు ఇదే కోవలోకి వస్తారు. కాని ఈజనరేషన్ హీరో అయిన ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన ఓ బ్యూటీ.. యంగ్ హీరో కు తల్లిగా నటించబోతుందని మీకు తెలుసా..? 

అన్షు.. ఈ పేరు చాలా మందికి తెలికపోవచ్చు. కాని మన్మధుడు, రాఘవేంద్ర సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుకు వస్తుంది.  నాగార్జున మన్మథుడు చిత్రంతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రేతో పాటు అన్షు కూడా ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

ప్రభాస్ అమ్మగారికి బాగా ఇష్టమైన సినిమా ఏదో తెలుసా..? కొడుకుని ఆ సినిమాలో చూసి మురిసిపోయిందట స్టార్ మదర్..


మన్మథుడు తర్వాత, ప్రభాస్‌తో రాఘవేంద్రలో నటించింది. ఆ తర్వాత ఓ నాలుగైదు సినిమాల్లో నటిచిన ఈబ్యూటీ ఆతరువా సినిమాలకు గుడ్ బై చెప్పింది. తాజా సమాచారం ప్రకారం అన్షు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. అది కూడా తెలుగులోసందీప్ కిషన్ హీరోగా, డైరెక్టర్ త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. SK30 పేరుతో వస్తున్న ఈ చిత్రంలో అన్షు ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. 

హేమమాలిని డెలివరీ కోసం 100 రూమ్స్ బుక్ చేసిన ధర్మేంద్ర.. చాలా ఏళ్ల తర్వాత బయటపడ్డ సీక్రెట్..

ఇక్కడ షాకింగ్ విషయం ఏంటీ అంటే.. ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం సందీప్ కిషన్ తల్లిగా నటిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

అన్షు అంబాని  ఇరవై ఏంళ్ల తరువాత  రీఎంట్రీ ఇస్తోంది. అన్షు ఇండియన్ కాదు.. ఆమె  ఆమె ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆమె పూర్వీకులు భారతీయులే. ఇక మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ పేర్కోంది.

అన్షు అంబాని  ఇరవై ఏంళ్ల తరువాత  రీఎంట్రీ ఇస్తోంది. అన్షు ఇండియన్ కాదు.. ఆమె  ఆమె ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆమె పూర్వీకులు భారతీయులే. ఇక మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ పేర్కోంది. 

ఇక సినిమాలు మానేసిన తరువాత అన్షు..  లండన్‌కు చెందిన సచిన్ సాగర్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం అన్షు సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది. 

Latest Videos

click me!