పనిమనిషితో స్వలింగ సంపర్క సీన్ లో చేసేటప్పుడు ...

First Published May 9, 2024, 1:47 PM IST

కొంతమంది మాత్రం సోనాక్షి పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. 

Sonakshi Sinha


 ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’గురించిన విషయాలే. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇందులో సోనాక్షీతో (Sonakshi Sinha)సీన్స్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ సిరీస్ లో ఇద్దరు మహిళలు రొమాన్స్ చేసే సన్నివేశం ఉంది. ఈ సీన్ చాలా సోషల్ మీడియా జనాలను ఆసక్తిగా మాట్లాడుకునేలా చేస్తోంది.


ఈ సీన్స్  చేయటాన్ని  ఎలా మేనేజ్ చేశారన్న ప్రశ్నకు సోనాక్షి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మొదట్లో, భన్సాలీ నాకు పాత్ర గురించి వివరించాడు. ఆ విషయాన్ని హీరమండి గురించి ఓపెన్‌గా చెప్పారు. కథ విని నేను చాలా ఎగ్జైట్ అయ్యాను అన్నది సోనాక్షి. మా సిరీస్‌లో ఫరీదాన్ అనే పాత్ర చేశాను. ఆమె పాత్ర సిరీస్ లో స్వలింగ సంపర్కురాలు’ అని సోనాక్షి సిన్హా సినిమా గురించి చెప్పుకొచ్చింది.


అలాగే ఫరీదాన్ ,ఆమె ఇంటి పనిమనిషి మధ్య శృంగారం జరుగుతుంది. ఈ సన్నివేశం గురించి సోనాక్షి మాట్లాడింది.  ‘ ఫరీదాన్‌ అనే పాత్ర స్వలింగ సంపర్కురాలు .. అందుకే ఆమె మరో మహిళతో రొమాన్స్‌ చేసింది.   నేను చేసిన ఫరీదాన్‌ పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఆమె 9 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తనను అమ్మేస్తారు. ఈ కారణంగా ఆమె పురుషులను ద్వేషిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రతిదీ ఓపెన్‌గా చూపబడింది. భన్సాలీ చాలా భిన్నమైన కథను చూపించారు’ అని సోనాక్షి అన్నారు. 


ఇక  ఈ సినిమాలో ఇంటిమేట్‌ సన్నివేశం గురించి నటుడు ఇంద్రేష్‌ మాలిక్‌ మాట్లాడారు. ‘సోనాక్షీకి, నాకు మధ్య కొన్ని ఇంటిమేట్‌ సీన్స్‌ ఉన్నాయి. వాటి చిత్రీకరణ సమయంలో ఆమె తల్లి కూడా సెట్‌లో ఉన్నారు. దీంతో నాకు సిగ్గుగా అనిపించింది. అప్పుడు సోనాక్షీ నాతో మాట్లాడి రిలాక్స్‌గా ఉండమని కోరారు. సిరీస్‌కు ఇలాంటి సన్నివేశాలు అవసరమని ఆమె తల్లి ముందే నాతో చర్చించారు’ అని చెప్పారు.
 


అలాగే దర్శకుడి గురించి ఇంద్రేష్‌ మాట్లాడుతూ.. ‘భన్సాలీ ప్రతీ సన్నివేశాన్ని పర్‌ఫెక్ట్‌గా చిత్రీకరిస్తారు. షూటింగ్‌కు గంట ముందే నటీనటులతో చర్చిస్తారు. అందుకే ఎక్కువ రీటేక్‌లు అవసరం ఉండేవి కాదు. ఇందులో నా పాత్ర ఎన్నో భావోద్వేగాలతో ముడిపడి ఉంది. దానికి మంచి స్పందన వచ్చినందుకు ఆనందిస్తున్నా. ఇందులో కొన్ని సీన్స్  చిత్రీకరించేటప్పుడు నాకు తెలియకుండానే భయపడ్డాను. భన్సాలీ వాటి గురించి వివరంగా చెప్పి ధైర్యాన్నిచ్చారు’ అని ప్రశంసించారు. 
 


మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం 1920 నుంచి 1940 ల మ‌ధ్య కాలంలో లాహోర్‌లో రెడ్‌లైట్‌ ప్రాంతంగా పేరున్న‌ హీరామండిలోని వేశ్య‌ల జీవితాల నేప‌థ్యంలో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు భన్సాలీ. 
 


ముఖ్యంగా సోనాక్షి సిన్హా పోషించిన ఫరీదాన్‌ పాత్ర వెబ్‌ సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర పోషించినందుకుగాను సోనాక్షిపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అయితే కొంతమంది మాత్రం ఆమె పాత్రను తప్పుపట్టారు. దానికి కారణం ఆమె మరో మహిళతో కలిసి శృంగారంలో పాల్గొనడమే. ఆ ఇంటిమేట్‌ సీన్స్‌, దానికి గల కారణం సరిగ్గా చూపించలేదంటూ కొంతమంది విమర్శించారు. 
 


ఈ సినిమాలో ఒక్కో క్యారెక్టర్‌కి ఒక్కో రకమైన ప్రాధాన్యత ఇచ్చారు. సోనాక్షి పాత్రకు ప్రశంసలు లభించాయి. ఈ సిరీస్ లో లాహోర్‌లోని రెడ్‌లైట్ ఏరియా హీరామండి కథతో ఈ సిరీస్ ఉంటుంది. బ్రిటీష్ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో ఈ సిరీస్ ద్వారా చూపించారు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్  హీరమండి వెబ్ సిరీస్‌లో నటించారు.


మరో ప్రక్క  ఈ సిరీస్‌పై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి విమర్శలు కురిపించారు. ‘నేను దీన్ని ఇంకా చూడలేదు. కానీ లాహోర్‌లోని హీరామండిని చాలాసార్లు సందర్శించాను. బాలీవుడ్‌ నుంచి  ఇలాంటి సిరీస్‌లు వస్తాయని నాకు తెలుసు. వేశ్యా గృహాలు ఎప్పుడూ ఐశ్వర్యం, గ్లామర్‌, అందాలకు చిహ్నాలు కావు. అవి బాధలకు చిహ్నాలు. దీని గురించి తెలియాలంటే శ్యామ్‌ బెనెగల్ తెరకెక్కించిన ‘మండి’ చూడాలి. సృజనాత్మకత అంటే మానవ బాధలను గ్లామరైజ్‌ చేసి చూపించడమా? మురికివాడల్లో ఉండే వారి జీవితాన్ని సమృద్ధిగా చూపించడం సరైన పద్ధతేనా?’ అని ప్రశ్నించారు.

click me!