ప్రభాస్ ను క్లైమాక్స్ లో చంపబోతున్న డైరెక్టర్, ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? ఇంతకీ ఆ సినిమా ఏంటి?

తెలుగు సినిమాలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా.. క్లైమాక్స్ మాత్రం శుభం కార్డుతో పాజిటీవ్ గా ఎండ్ అవ్వాలి. అలా అవ్వకపోతే మనవాళ్లు ఒప్పుకోరు. ఇప్పడిప్పుడే ఈ  ట్రెండ్ నుంచి బయటకు వస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. అయితే తమిళ్ ,మలయాళం ఇండస్ట్రీలో అలా కాదు. వాళ్లు హీరోలను క్లైమాక్స్ లో నిర్దాక్షణ్యంగా చంపేస్తుంటారు. ఇక మనదగ్గర అలా చేస్తే సినిమా ప్లాప్ ఖాయం. తాజాగా  ప్రభాస్  సినిమా కోసం విషాద క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు. మరి అది వార్కౌట్ అవుతుందా.? 

Prabhas  Die in His Upcoming Film? Director Hanu Raghavapudi  Climax Plan Shocks Fans in telugu jms

టాలీవుడ్ ఇండస్ట్రీ గ్లామర్ ఫీల్డ్. హీరోలు చాలా హ్యాండ్సమ్ గా, అందంగా కనిపించాలి, పదిమందిని  కొట్టాలి, యాక్షన్ సీన్స్ తో  హీరోయిజం చూపించాలి అలా అయితేనే మనవాళ్ళు యాక్సప్ట్  చేస్తారు. కొన్ని సందర్భాల్లో మరీ ఇంతలా ఆలోచించకపోయినా.. హీరో డీ గ్లామర్ లుక్ లో కనిపించినా ఒప్పుకుంటారు. కాని తమఅభిమాన హీరోని సినిమా క్లైమాస్స్ లో చంపేస్తాం అంటే మాత్రం ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు. సినిమాల్లో కాదు.. కలలో కూడా తమ  అభిమాన హీరోని చంపేస్తాం అంటే ఊరుకోరు. తమిళంలో అలా కాదు. ఎంత పెద్ద హీరో అయినా కథ డిమాండ్ చేస్తే చచ్చిపోవాల్సిందే. 

Also Read:  8000 కోట్లకు అధిపతి, 300 కోట్ల ఇంటిని రోజుకు 2 లక్షలకు అద్దెకిస్తున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
 

Prabhas  Die in His Upcoming Film? Director Hanu Raghavapudi  Climax Plan Shocks Fans in telugu jms

గతంలో విజయ్ కాంత్ రమణ సినిమా క్లైమాక్స్ లో  ఆయన పాత్రకు ఉరిపడుతుంది. అదే సినిమాను చిరంజీవితో ఠాగూర్ పేరుతో  తెరకెక్కిస్తే.. చిరంజీవిని కోర్డ్ అర్ధం చేసుకుని శిక్ష తక్కువ పడేలా కథను మార్చేశారు. అలాగే టెంపర్ సినిమాలో కూడా.. ఎన్టీఆర్ ను క్లైమాక్స్ లో వదిలేస్తారు, కాని విశాల్ ఈసినిమాను రీమేక్ చేస్తే.. అందులో విశాల్ కు క్లైమాక్స్ లో ఉరి శిక్ష వేస్తారు.

ఇలా మన సినిమాలో హీరోకు ఏదైనా అయితే ఫ్యాన్స్ ఊరుకోరు.  అయితే ఈమధ్య ఈ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్ తగ్గుతున్నారు. దాంతో  కాస్త కాన్సెప్ట్ ఓరియెంట్ తో సినిమాలు వస్తున్నాయి. అందుకోసం హీరో, హీరోయిన్లను చంపినా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆ కథను అర్ధం చేసుకుని వదిలేస్తున్నారు. 

Also Read: శ్రీదేవికి , చిరంజీవికి మధ్య గొడవ, మధ్యలో ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా? అసలేం జరిగింది.


తాజాగా ప్రభాస్ సినిమా కోసం అలాంటి క్లైమాక్స్ నే ప్లాన్  చేశాడట స్టార్ డైరెక్టర్. తన సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్రను చంపేయబోతున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా? హనురాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కతున్న సినిమాకోసం ఈ క్లైమాక్స్ ను ప్లాన్ చేశారట. ఫౌజీ పేరుతో ప్రచారంలో ఉన్న ఈసినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఇక హను రాఘవపూడి సినిమాల్లో హీరోలు చనిపోవడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తోంది. ఆయన తీసిన ఫస్ట్ మూవీ అందాల రాక్షసి’ సినిమాలో రాహుల్ క్యారెక్టర్ చనిపోతుంది.

Also Read: రామ్ చరణ్ నా ఫస్ట్ క్రష్ అంటున్న రవితేజ హీరోయిన్ ఎవరో తెలుసా?

Hanu Raghavapudi about Prabhas film expectation

హను రాఘవపూడి తీసిన ఫస్ట్ మూవీ అందాల రాక్షసి’ సినిమాలో రాహుల్ క్యారెక్టర్ చనిపోతుంది.ఇక అలాగే  ఈమధ్యలో వచ్చిన సీతారామం’ సినిమాలో హీరో  దుల్కర్ సల్మాన్ పాత్ర కూడా చివర్లో చనిపోతుంది. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కూడా ఒక మెలో డ్రామా ని యాడ్ చేసి సినిమా చివర్లో ప్రభాస్ ను చంపేయబోతున్నాడా అనే వార్త వైరల్ అవుతుంది. మరి హను రాఘవపూడి ఏం చేస్తాడో చూడాలి. 

Also Read: త్రిష దగ్గర అజిత్ ఫోన్ నెంబర్ ఉందా? ఫ్యాన్స్ ప్రశ్నలకు షాక్ అయిన స్టార్ హీరోయన్

Latest Videos

vuukle one pixel image
click me!