Khushi Kapoor
అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇద్దరి బాలీవుడ్ లో రాణిస్తున్నారు. పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఆల్రెడీ స్టార్ గా ఎదిగింది. పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇక చిన్న కుమార్తె ఖుషి కపూర్ మాత్రం ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటిస్తూ గుర్తింపు పొందుతోంది.
Khushi Kapoor
జాన్వీ, ఖుషి కపూర్ ఇద్దరూ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. జాన్వీ కపూర్ లవ్ ఎఫైర్ గురించి ఆల్రెడీ వార్తలు వచ్చాయి. శిఖర్ పహారియాతో జాన్వీ రిలేషన్ లో ఉంది. తాజాగా ఖుషి కపూర్ ప్రేమాయణం కూడా బయట పడింది. ఒక కశ్మీరీ కుర్రాడితో ఖుషి కపూర్ రిలేషన్ లో ఉంది. ఈ విషయాన్నీ ఖుషి కపూర్ పరోక్షంగా అంగీకరించింది.
Khushi Kapoor
ఖుషి కపూర్ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ఈ ఫొటోస్ లో ఆమె అందమైన నెక్లెస్ ధరించి కనిపిస్తోంది. V లవ్స్ K అని రాసి హార్ట్ సింబల్ తో ఉన్న నెక్లెస్ అది. అందులో K అంటే ఖుషి కపూర్. V అంటే వేదాంగ్ రైనా. ఈ యువ నటుడు బాలీవుడ్ లో జిగ్రా చిత్రంతో గుర్తింపు పొందాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.
Khushi Kapoor
ఇప్పుడు ఆ రూమర్స్ ని ఖుషి కపూర్ పరోక్షంగా అంగీకరించింది. వేదాంగ్ కశ్మీరీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. వాళ్ళు ముంబైలో స్థిర పడ్డారు. మొదట మోడలింగ్ లో రాణించిన వేదాంగ్ ఆ తర్వాత నటుడిగా అవకాశాలు అందుకుంటున్నారు. వేదాంగ్, ఖుషి కపూర్ జంట చూడ ముచ్చటగా ఉంటుంది అంటూ అప్పుడే నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.