రెండో పెళ్లి చేసుకున్న ప్రియాంక:
విడాకుల తర్వాత నచ్చిన వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటానని చెప్పిన ప్రియాంక ఇప్పుడు వాసి అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రియాంక పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు తప్ప మిగతా వివరాలేవీ ఇంకా బయటకు రాలేదు. రెండో పెళ్లితో ప్రియాంకకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.