ఆ విషయంలో ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన ప్రభాస్.. కానీ, నెక్ట్స్ లెవెల్ ట్రీట్స్‌తో రాబోతున్న డార్లింగ్

Published : Sep 15, 2025, 03:30 PM IST

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ఒక సినిమా కూడా విడుదల చేయక ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు. కానీ, మిరాయ్ వాయిస్ ఓవర్, కన్నప్పలో రుద్రగా కనిపించి చిన్న ట్రీట్స్ ఇచ్చారు. ఇక తన మూవీస్ తో అక్టోబర్ నుంచి వరుస  సర్ప్రైజ్‌లు రెడీ చేస్తున్నారట. 

PREV
15
డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం స్కెచ్ రెడీ!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాలను పాన్ ఇండియా లెవల్ కు తీసుకెళ్లాయన. బాహుబలి సిరీస్ హిట్ తో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. ఆ తరువాత వరుసగా భారీ బడ్జెట్ మూవీ, పాన్ ఇండియా సినిమాల్లో బిజీబిజీగా మారిపోయారు. ఆయన లైన్ అప్ చూస్తే.. పిచ్చేకుతుంద అంటే అతిశయోక్తి కాదు. అయితే.. ప్రభాస్ తన ఫ్యాన్స్ ను డార్లింగ్స్ అని పిలుస్తారు. ఆయనకు తన ఫ్యాన్స్ అంటే అంతా ప్రేమ. కానీ, ఈ ఏడాది ఫ్యాన్స్‌ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. అసలేం జరిగింది?

25
ఫ్యాన్స్ ను హార్ట్ చేసిన ప్రభాస్

వాస్తవానికి ప్రభాస్ భారీ బడ్జెట్ మూవీస్ తో బిజీబిజీగా ఉన్నారు. కానీ, ఈ ఏడాది తన ఫ్యాన్స్‌ను గట్టిగానే హర్ట్ చేశాడు డార్లింగ్ ప్రభాస్. సంవత్సరానికి మినిమం వన్, మాక్సిమం రెండు సినిమాలు వస్తాయని గతంలో ప్రభాస్ తన ఫ్యాన్స్ కు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అలా ప్రామిస్ చేసిన రెబల్ స్టార్ ఈ 2025లో ఆయన తన మాట నిలబెట్టుకోలేకపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకరాలేకపోయారు. ప్రత్యేకంగా రాజా సాబ్ సినిమా ఈ ఏడాది ప్రారంభంలోనే వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు. కానీ, వారికి వరుస వాయిదాలు తీవ్ర నిరాశ కలిగించాయి.

35
ఫ్యాన్స్ కు స్పెషల్ సర్ఫైజ్ లు

వరుస సినిమాలతో రాకపోయినా ప్రభాస్ తన ఫ్యాన్స్ కు మాత్రం చిన్న చిన్న సర్రైజ్ లు అందిస్తున్నారు. మిరాయ్ సినిమాలో వాయిస్ ఓవర్ ద్వారా ఆయన చిన్న ట్రీట్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు. చిన్న సినిమాలకు సపోర్ట్ చూపుతూ, పాజిటివ్ బూస్టర్ అయ్యారు. అలాగే, అలాగే మంచు విష్ణు ‘కన్నప్ప’లో కూడా ఓ గెస్ట్ రోల్ లో నటించారు. రుద్ర పాత్రలో 15 నిమిషాలు కనిపించి, సినిమా భారీ ఓపెనింగ్‌కు కారణమయ్యారు ప్రభాస్. రీసెంట్‌గా సినిమాలు రాకపోయినా, ఫ్యాన్స్‌కు మంచి అప్డేట్స్ అందించబోతున్నారు.

45
డార్లింగ్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్

డార్లింగ్ ప్రభాస్ పలు భారీ ప్రాజెక్ట్స్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రభాస్ అక్టోబర్ మొత్తం బిజీగా ఉంటారు. మొత్తం ప్రభాస్ ఆక్యుపై చేయబోతున్నాడు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రాజా సాబ్ ట్రైలర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే.. హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ కోసం ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎదురుచూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా చిత్రం స్పిరిట్ నుండి కూడా చిన్న ట్రీట్స్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే అక్టోబర్ 31న థియేటర్లలో బాహుబలి ది ఎపిక్‌ రాబోతుంది.

55
డార్లింగ్ భారీ స్కెచ్

ఈ ఏడాది ప్రభాస్ సినిమా రాకపోయినా చిన్న ప్రాజెక్ట్స్, ఇతర సినిమాలు, గెస్ట్ రోల్స్, సింగిల్స్, ఈవెంట్స్ ద్వారా ప్రేక్షకులకు ట్రీట్ ఇచ్చారు. అక్టోబర్ నుండి ఫ్యాన్స్‌కు బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ అందిస్తూ, వచ్చే ఏడాదికి అప్‌డేట్స్, స్పెషల్ సర్ప్రైజ్‌లు అందించబోతున్నట్టు తెలుస్తోంది. నిరాశలో ఉన్న ఫ్యాన్స్ లో జోష్ నింపేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రతీ నెలా ఏదో ఒక అప్డేట్ అందించడం ద్వారా ఫ్యాన్స్ ఎంగేజ్‌మెంట్ ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆడియెన్స్ ను పలకరించేందుకు స్కెచ్ రెడీ చేస్తున్నాడు ప్రభాస్.

Read more Photos on
click me!

Recommended Stories