
యంగ్ హీరో తేజ సజ్జ - డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన ‘మిరాయ్’(Mirai) సంచనలం సృష్టిస్తోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిస్తోంది, పలు రికార్డులను బ్రేక్ చేస్తుంది. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మిరాయ్ వీకెండ్ నాటికి కలెక్షన్ల తుఫాను సృష్టించింది. మూడు రోజుల కలెక్షన్స్ ఎన్నో కోట్లు? బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా ఎంత వసూళ్లు చేయాలి?
‘మిరాయ్’(Mirai)సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ యాక్షన్ అడ్వెంచర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ తెరక్కెకింది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మిరాయ్ లో తేజ సజ్జా సూపర్ పవర్స్ కలిగిన యోధుడి పాత్రలో కనిపించగా, విలక్షణ నటుడు మంచు మనోజ్ విలన్ పాత్రలో బ్లాక్ స్వర్డ్ అనే ప్రత్యేకమైన రోల్‌లో దుమ్మురేపాడు. ఇక సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ తల్లి పాత్రలో నటించగా , జగపతి బాబు, జయరామ్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. ఈ పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ సినిమాకు కృతి ప్రసాద్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
బాక్సాఫీస్ దగ్గర ‘మిరాయ్’ దూకుడు కంటిన్యూ అవుతోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా వసూళ్ల విషయంలో వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. డివోషనల్ సస్పెన్స్ కథాంశంతో ఫాంటసీ ఎలిమెంట్స్ కలిపి రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వీకెండ్ నాటికి కలెక్షన్ల తుఫాను సృష్టించింది. తొలి రోజే రూ. 27 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక రోజు కలెక్షన్లు అంతకు మించి అనేలా సాగాయి. రెండు రోజుల కలిపి ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ₹55.60 కోట్ల గ్రాస్ రాబట్టిందని ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. దీంతో రెండు రోజుల్లో 50 కోట్ల గ్రాస్ దాటేసింది.
ఇక మిరాయ్ మూడో రోజు కలెక్షన్లు చూస్తే... మిరాయ్ రెండో రోజు కలెక్షన్ల కంటే మూడో రోజు కలెక్షన్స్ మరింత ఊపందుకోవడం విశేషం. ఇండియాలోనే సెకండ్ డే కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టడం సినిమాగా నిలిచింది. తాజాగా విడుదలైన కలెక్షన్ రిపోర్ట్స్ ప్రకారం.. మూడో రోజు కూడా మిరాయ్ అదే జోరుతో కొనసాగింది. మూడు రోజులలో 81.2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది, దీని ప్రకారం మిరాయ్ బ్లాక్ బస్టర్ హిట్ గా మారే దిశలో ముందడుగు వేస్తుంది. అతి త్వరలోనే 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
మిరాయ్ చిత్రానికి 60 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తోంది. కాగా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే 44 కోట్ల దాకా రాబట్టింది. ఈ లెక్క ప్రకారం సినిమా విజయవంతం కావాలంటే కనీసం 90 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. మూడు రోజులలోనే 81 కోట్లు రాబట్టిన మిరాయ్, మరో 9 కోట్ల కలెక్షన్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తోంది. నాన్-థియేట్రికల్ రైట్స్ నుండి కూడా 45 కోట్లు వచ్చే అవకాశంతో, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు మొత్తం మంచి ప్రాఫిట్ లభించనుందని అంచనా వేస్తున్నారు.
‘మిరాయ్’ సినిమాకి విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్ రావడంతో పాటు ప్రేక్షకులు కూడా ఘనంగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో రాముడి ఎంట్రీ, అశోక చక్రవర్తి నుంచి శ్రీరాముడి వరకు కథ కనెక్ట్ అయిన తీరు – వీటన్నింటి వల్లే సినిమాకి కలెక్షన్ల రూపంలో భారీ బూస్ట్ వచ్చింది.
తేజ సజ్జా ‘మిరాయ్’ మూవీ కలెక్షన్ల పరంగా దూసుకపోతుంది. ఈ రేసులో మిరాయ్ ఓ అరుదైన రికార్డ్ ను నెలకొల్పింది. రెండో రోజు ఏపీ-టీజీ కలెక్షన్లలో మిడిల్ రేంజ్ మూవీస్ వసూళ్లలో ఈ సినిమా దుమ్మురేపింది. టాలీవుడ్‌లో మిడ్ రేంజ్ సినిమాల్లో తెలుగు బాక్సాఫీస్ వద్ద మిరాయ్ మూవీ రెండో రోజు భారీ వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ. 8.2 కోట్లు కలెక్ట్ చేసి, మిరాయ్ మూవీ టాప్‌లో దూసుకెళ్లింది. అంతకుముందు తండేల్ (7.42 కోట్లు), టిల్లు స్క్వేర్ (7.36 కోట్లు), కుబేరా (7.21 కోట్లు), ఉప్పెన (6.86 కోట్లు) లతో ఈ ఫిట్ సాధించాయి.
తెలుగు బాక్సాఫీస్ వద్ద రెండో రోజు భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల్లో హిట్ 3 మూవీ రూ. 6.03 కోట్లు, దసరా రూ. 5.86 కోట్లు, విరూపాక్ష రూ. 5.80 కోట్లు, ఖుషి రూ. 5.36 కోట్లు, లవ్ స్టోరీ రూ. 5.08 కోట్లు, మజిలీ రూ. 4.98 కోట్లు, మ్యాడ్ స్క్వేర్ రూ. 4.84 కోట్లు, కింగ్‌డమ్ రూ. 4.58 కోట్లు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రూ. 4.54 కోట్లు, బింబిసార రూ. 4.52 కోట్లు, శ్యామ్ సింఘ రాయ్ రూ. 4.38 కోట్లు, హనుమాన్ రూ. 4.36 కోట్లు, ఇస్మార్ట్ శంకర్ రూ. 4.32 కోట్లు, భీష్మ రూ. 4.27 కోట్లు, గీతగోవిందం రూ. 4.12 కోట్లు ఉన్నాయి. మొత్తం చూస్తే, మిరాయ్ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి ముందంజలో నిలిచింది.