మిరాయ్ కథ కాపీనా, సూపర్ స్టార్ కృష్ణ మూవీ నుంచి మక్కీకి మక్కీ దించేశారు ? 56 ఏళ్ళ క్రితం వచ్చిన ఆ సినిమా ఇదే

Published : Sep 15, 2025, 02:27 PM IST

లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మిరాయ్ కథ కాపీ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 56 ఏళ్ళ క్రితం విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఓ మూవీ నుంచి మిరాయ్ కథ కాపీ చేశారు అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. 

PREV
15
బాక్సాఫీస్ వద్ద మిరాయ్ సంచలనం 

యువ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లో మిరాయ్ మూవీ ఏకంగా 80 కోట్లు రాబట్టినట్లు నిర్మాతలు ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో కూడా మిరాయ్ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. తేజ సజ్జా హనుమాన్ చిత్రంలో ఆంజనేయస్వామి బ్యాక్ డ్రాప్ తో హిట్ కొడితే.. ఈ మూవీలో శ్రీరాముడి బ్యాక్ డ్రాప్ లో విజయం సాధించాడు. 

25
తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన క్వాలిటీ 

ఇంతటి అద్భుతమైన గ్రాండ్ విజువల్స్, విఎఫెక్స్ తో స్టార్ హీరోలు సినిమా చేయాలంటే కనీసం 300 కోట్ల బడ్జెట్ అవుతుంది. అలాంటిది తేజ సజ్జా హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కేవలం 50 కోట్ల బడ్జెట్ లో ఇంతటి మంచి అవుట్ పుట్ రాబట్టి అందరినీ ఫిదా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా మిరాయ్ డైరెక్టర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియా వచ్చాక కాపీ కంటెంట్ ని నెటిజన్లు ఈజీగా కనిపెట్టేస్తున్నారు. 

35
మిరాయ్ కథ కాపీనా ?

మిరాయ్ చిత్రం కూడా కాపీనే అని నెటిజన్లు దర్శకుడు కార్తీక్ ని ట్రోల్ చేస్తున్నారు. మిరాయ్ కథని సూపర్ స్టార్ కృష్ణ నటించిన 56 ఏళ్ళ నాటి సినిమా నుంచి మక్కీకి మక్కీ దించేశారని అంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే మహాబలుడు.  కృష్ణ, వాణిశ్రీ జంటగా నటించిన మహా బలుడు చిత్రం 1969లో విడుదలైంది. ఈ చిత్ర కథ, మిరాయ్ కథ ఒకేలా ఉన్నాయి అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. దీనితో మిరాయ్ మూవీపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 

45
నెటిజన్ల ట్రోలింగ్ 

కొంపదీసి మిరాయ్ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసా అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. మిరాయ్ కాపీ విషయంలో నెటిజన్లు రెండు గ్రూపులుగా వికిపోయారు. కొందరు మిరాయ్ చిత్రంలో కథ, పాత్రలు వేరని.. మహాబలుడుతో సంబంధం లేదని అంటున్నారు. మరికొందరు మాత్రం మిరాయ్ చిత్ర కథ మహాబలుడు కథతో పోలి ఉందని అంటున్నారు. 

55
కృష్ణ మహాబలుడు మూవీ కోసం సెర్చింగ్ 

మిరాయ్ కాపీ ఆరోపణల పుణ్యమా అని యూట్యూబ్ లో నెటిజన్లు కృష్ణ మహాబలుడు చిత్రాన్ని వీక్షించడం మొదలు పెట్టారు. మొత్తం మీద కాపీ ఆరోపణలతో మిరాయ్ చిత్రం కూడా వార్తల్లో నిలిచింది. తక్కువ బడ్జెట్ లో మిరాయ్ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించారు అనే ప్రశంసలు వినిపిస్తున్న తరుణంలో ఈ కాపీ ఆరోపణలు ఊహించని పరిణామమే. 

Read more Photos on
click me!

Recommended Stories