Allu Arjun - Atlee Movie: పూజా హెగ్డే మరోసారి ఐటెం సాంగ్ చేయబోతోందని, అది కూడా అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ లో రాబోయే భారీ బడ్జెట్ చిత్రంలో అని కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో పూజా హెగ్డే గురించి ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. నటి తమన్నా భాటియా మాదిరిగానే పూజా హెగ్డే కూడా ఒకవైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు ఐటెం సాంగ్స్‌తో సందడి చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న కూలీ సినిమాలో ఐటెం సాంగ్ తో ఆకట్టుకున్న పూజా హెగ్డే.. ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.
25
బుట్టబొమ్మ బిజీబిజీ
కూలీ చిత్రంలో "మోనికా లవ్ యూ మోనికా" పాటతో అదరగొట్టింది పూజా హెగ్డే. అంతకుముందు రంగస్థలం చిత్రంలో "జిగేల్ రాణి"గా మారి స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఆ తర్వాత F3 చిత్రంలోనూ ఒక స్పెషల్ సాంగ్‌లో చిందులేసి తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ విధంగా తమన్నా భాటియా మాదిరిగా ఒకవైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే, మరోవైపు ఐటెం సాంగ్స్ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తోంది బుట్టబొమ్మ.
35
పూజా హెగ్డే స్పెషల్ సాంగ్
ఈ వ్యూహమే తనకు బాగా కలిసి వచ్చిందని భావించిందేమో, పూజా హెగ్డే మరోసారి కూడా స్పెషల్ సాంగ్‌లో నటించబోతుందట. ఈసారి టాలీవుడ్, కోలీవుడ్‌లో అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్‌లో ఆమె భాగం కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయబోతోందన్న బజ్ కోలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.
ఈ చిత్రం దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో దీపికా పదుకొనె హీరోయిన్‌గా ఖరారు కాగా, మృణాల్ ఠాకూర్ మరో హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. వీరితోపాటు పలువురు అందాల తారల పేర్లు బయటకు వచ్చినా, చిత్ర బృందం మాత్రం ఎవరి పేరునూ అధికారికంగా వెల్లడించలేదు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌తో పూజా హెగ్డే ఐటెం సాంగ్ చేయబోతోందన్న వార్తలు పుట్టుకొస్తున్నాయి.
55
ఐదు కోట్ల రెమ్యునరేషన్
అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబోలో ఇప్పటివరకు రెండు చిత్రాలు వచ్చాయి. దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో. ఈ రెండు చిత్రాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి.. ఈ జోడిని విజయవంతమైన పెయిర్‌గా మార్చాయి. ఈ కారణంగానే అట్లీ, పూజా హెగ్డేను స్పెషల్ సాంగ్ కోసం ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్‌లో తాజా బజ్. అయితే ఈ ఐటెం సాంగ్ కోసం ఆమె ఐదు కోట్లు అడిగిందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతో అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.