ఎవరికీ తెలియకుండా ఈ విలన్ అంత గొప్ప పని చేశారా, పేద విద్యార్థుల కోసం ఏం చేశారంటే..

Published : Oct 27, 2025, 06:39 PM IST

విలన్ గా, కమెడియన్ గా రాణించిన జయప్రకాశ్ రెడ్డి గొప్ప మనసు గురించి తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పేద విద్యార్థుల కోసం ఆయన ఏం చేశారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
జయప్రకాశ్ రెడ్డి సినిమాలు 

దివంగత నటుడు జయప్రకాశ్ రెడ్డి గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో జయప్రకాశ్ రెడ్డి విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో విలన్ గా నటించారు. ఢీ, రెడీ, కబడ్డీ కబడ్డీ లాంటి చిత్రాల్లో నవ్వులు పూయించారు. నాయక్ మూవీలో జయప్రకాశ్ రెడ్డి చేసిన కామెడీ హైలైట్ గా నిలిచింది.

25
ఎవ్వరికీ తెలియకుండా గొప్ప మనసు చాటుకున్న నటుడు 

జయప్రకాష్ రెడ్డి నటన గురించి అందరికీ తెలుసు కానీ ఆయన గొప్ప మనసు గురించి తెలియకపోవచ్చు. ఎప్పుడూ తాను చేసిన మంచి పనులని ఆయన బయటకి చెప్పుకోలేదు. ఓ ఇంటర్వ్యూలో మాత్రం తాను చేసిన సేవా కార్యక్రమాల గురించి కొంచెం చెప్పారు. పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారిని చదివించాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. నటుడిని అయ్యాక జూనియర్ ఆర్టిస్టుల పిల్లలు, జూనియర్ టెక్నీషియన్ల పిల్లలు ఎందరినో చదివించాను. 

35
పేద విద్యార్థుల కోసం.. 

ప్రతిభ ఉండి, మంచి పెర్సెంటేజ్ పొందిన వారిని ఇంజనీరింగ్ లాంటి ఉన్నత విద్యలు కూడా చదివించాను. చాలా మందికి పీజులు కట్టాను. ఇదంతా ఎవ్వరికీ తెలియకుండా చేశాను. మా నాన్న గారి నుంచి నాకు ఈ అలవాటు వచ్చింది. ఆయన ఎందరికో ఉద్యోగాలు ఇప్పించారు,, ఆర్థిక సహాయాలు చేశారు. ఆయన చేసిన గొప్ప పనులలో కొంతైనా నేను కూడా చేయాలని అనుకున్నట్లు జయప్రకాశ్ రెడ్డి తెలిపారు. 

45
గుర్తింపు తెచ్చిన సినిమాలు 

 సినిమాల్లో ఇష్టం లేకపోయినా ఒకరోజు, రెండు రోజుల షూటింగ్ ఉండే చిన్న చిన్న పాత్రలు చేశాను. అలా చేసిన వాటిలో కూడా కొన్ని చిత్రాలలో నాకు మంచి గుర్తింపు వచ్చింది. కబడ్డీ కబడ్డీ చిత్రంలో నేను చేసింది ఒకరోజు షూటింగ్ ఉన్న పాత్రే.. కానీ ఆ సినిమాతో నాకు సమరసింహారెడ్డి కంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. శ్రీనువైట్ల నాకు తన మొదటి సినిమాలో ఎక్కువరోజులు షూటింగ్ ఉండే పాత్ర ఇచ్చారు. ఆ తర్వాత ఒక రోజు మాత్రమే షూటింగ్ ఉండే పాత్రలు ఇవ్వడం ప్రారంభించాడు. 

55
స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేసిన జయప్రకాశ్ రెడ్డి 

 దీనితో ఒక దశలో నేను చేయను అని శ్రీనువైట్లకు చెప్పేశా. ఒక స్టార్ హీరో సినిమాలో కూడా ఛాన్స్ రిజెక్ట్ చేశా. ఆ తర్వాత ఢీలో వైవిధ్యమైన కామెడీ రోల్ ఇచ్చారు. అది నా కెరీర్ కి బాగా ప్లస్ అయింది అని జయప్రకాశ్ రెడ్డి అన్నారు. 2020లో జయప్రకాశ్ రెడ్డి గుండెపోటు కారణంగా మరణించారు. 

Read more Photos on
click me!

Recommended Stories