చిరంజీవి సినిమాకి అలా చేస్తే ప్రొడ్యూసర్ చచ్చినట్లే, కథ పాడైపోతుందని తప్పుకున్న డైరెక్టర్

Published : Oct 27, 2025, 05:28 PM IST

చిరంజీవి చెప్పినట్లు చేస్తే కథ పాడైపోతుందని ఓ స్టార్ డైరెక్టర్ మూవీ నుంచి తప్పుకున్నారు. కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చిరంజీవి ఆ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు. 

PREV
15
తెలుగు సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ 

మలయాళం తరహాలో కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు తెలుగులో కూడా రావాలి అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. మన తెలుగు సినిమాల్లో పాటలు, ఫైట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వాటిని నిర్మాతలు కమర్షియల్ ఎలిమెంట్స్ గా పరిగణిస్తారు. తెలుగులో మలయాళం తరహా కథాంశం బలంగా ఉండే చిత్రాలు ఎందుకు రావడం లేదు అనే ప్రశ్నకు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. 

25
అలా అయితే నేను రెడీ 

చాలా ఏళ్ళ నుంచి బాలీవుడ్ తర్వాత అత్యధిక మార్కెట్ తెలుగు సినిమాకే ఉంది. తెలుగు సినిమాకి జరిగే బిజినెస్ ఎక్కువ. ఆడియన్స్ ప్రపంచ స్థాయిలో ఉన్నారు. మన దగ్గర థియేటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీరందరినీ పోషించాలి అంటే సినిమా బిజినెస్ ఎక్కువ జరగాలి. పెట్టిన బడ్జెట్ వెనక్కి రావాలి అంటే పాటలు, ఫైట్స్ లాంటివి తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. 30 రోజుల్లో సినిమా అయిపోతుంది, తక్కువ బడ్జెట్ పెడితే చాలు.. లాభాలు ఎక్కువగా ఆశించనక్కర్లేదు అని భావిస్తే తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాతోటి హీరోలంతా ముందుకు వస్తాయి. 

35
చిరంజీవి సినిమాకి అలా చేస్తే రిస్క్ 

కానీ మనదగ్గర ఉన్న పరిస్థితి అది కాదు. ఉదాహరణకి తమిళంలో రమణ అనే చిత్రం తీసుకుందాం. ఈ మూవీకి ముందుగా దర్శకుడిగా మురుగదాస్ నే అనుకున్నాం. నా సినిమా అంటే ఆడియన్స్ తప్పనిసరిగా డ్యాన్సులు, పాటలు ఆశిస్తారు. రమణ మూవీ గురించి తెలుసుకున్న ఒక నిర్మాత నాతో.. సార్ ఆ సినిమాలో హీరో చనిపోతాడు. మిమ్మల్ని చనిపోయినట్లు చూపిస్తే నిర్మాతలం మేము చచ్చినట్లే. చాలా రిస్క్ అని అన్నారు. 

45
మురుగదాస్ అందుకే తప్పుకున్నాడు 

దీనితో రమణ కథని క్లైమాక్స్ లో మార్చాం. కేవలం జైలు శిక్ష మాత్రమే పడేటట్లు చేశాం అని చిరంజీవి అన్నారు. కానీ దానికి మురుగదాస్ ఒప్పుకోలేదు. సార్ ఈ కథలో హీరో త్యాగమూర్తి సార్. ఉరికంబం ఎక్కి ప్రాణాలు అర్పిస్తాడు అని అన్నారు. అదే విధంగా పాటలు పెట్టి కథని పాడు చేయవద్దు సార్ అని చెప్పాడు. మేము దానికి అంగీకరించలేదు. దీనితో మురుగదాస్ ఠాగూర్ మూవీ చేయలేనని తప్పుకున్నారు. అప్పుడు మురగదాస్ స్థానంలోకి వివి వినాయక్ వచ్చారు. 

55
భారీ విజయం సాధించిన ఠాగూర్ 

ఠాగూర్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఠాగూర్ మూవీలో చిరంజీవి డైలాగులు, మణిశర్మ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో శ్రీయ, జ్యోతిక హీరోయిన్లుగా నటించారు. 

Read more Photos on
click me!

Recommended Stories